AP One Stop Centre Notification 2026 | AP సంక్షేమ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశం. One Stop సెంటర్వి లో వివిధ పోస్టుల భర్తీకి 2026 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా Case Worker, Para Medical, Psycho Social పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 17 ఖాళీలు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు 2026 అక్టోబర్ 12 చివరి తేదీగా ఉంది. ఎంపికైన వారికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం ఉంటుంది.

పోస్టుల వివరాలు

  • Case Worker – 8 పోస్టులు
  • Para Medical – 8 పోస్టులు
  • Psycho Social – 1 పోస్టు
  • మొత్తం – 17 పోస్టులు

విద్యార్హతలు

Case Worker: Law, Social Work, Sociology, Social Science లేదా Psychologyలో Degree ఉండాలి. మహిళలకు సంబంధించిన రంగంలో ప్రభుత్వ సంస్థ లేదా NGOలో 3 సంవత్సరాల అనుభవం అవసరం.

Para Medical: Paramedics/Health Sectorలో Professional Degree, ముఖ్యంగా GNM లేదా B.Sc Nursing అర్హత ఉండాలి. మహిళలకు సంబంధించిన Health Sectorలో ప్రభుత్వ సంస్థ లేదా NGOలో 3 సంవత్సరాల అనుభవం అవసరం.

Psycho Social: Psychology, Psychiatry లేదా Social Scienceలో Degree/Diploma ఉండాలి. సంబంధిత మహిళా ఆరోగ్య రంగంలో ప్రభుత్వ సంస్థ లేదా NGOలో 3 సంవత్సరాల అనుభవం అవసరం.

వయోపరిమితి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 39 సంవత్సరాల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ నిబంధనల ప్రకారం SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు, PwD అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదిలు

  • నోటిఫికేషన్ తేదీ: 05-10-2026
  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: 06-10-2026
  • దరఖాస్తుకు చివరి తేదీ: 12-10-2026

ఎంపిక విధానం

ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపికలో:

  1. Application Scrutiny
  2. Document Verification

వంటి ప్రక్రియలు ఉంటాయి. ఉద్యోగాలు Contract Basisపై భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు విధానం

అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా అధికారిక నోటిఫికేషన్‌ను download చేసుకోవాలి Download చేసే లింక్ క్రింద ఇచ్చాను. అనంతరం Application Formను డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన వివరాలను సరిగ్గా పూర్తి చేయాలి.

ఫోటో, సంతకం, విద్యార్హత సర్టిఫికెట్లు, అనుభవ ధ్రువపత్రాలు మరియు నోటిఫికేషన్‌లో సూచించిన ఇతర పత్రాల self-attested copies జత చేయాలి.

పూర్తి చేసిన దరఖాస్తును నోటిఫికేషన్‌లో పేర్కొన్న చిరునామాకు Speed Post/Registered Post ద్వారా పంపాలి. దరఖాస్తు 12 అక్టోబర్ 2026 లోపు చేరేలా చూసుకోవాలి.

Official Notification : Click Here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment