ప్రభుత్వ యూనివర్సిటీలో ఉద్యోగం సాధించాలనుకునే వారికి మంచి అవకాశం వచ్చింది. University పరిధిలోని Maitreyi Collegeలో వివిధ Non-Teaching పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 52 పోస్టులను Permanent Basisపై భర్తీ చేయనున్నారు.
10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతలతో పాటు పోస్టును బట్టి అనుభవం, టైపింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం వంటి అర్హతలు అవసరం. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 52 పోస్టులు
ఈ రిక్రూట్మెంట్లో పోస్టుల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి:
| పోస్టు | ఖాళీలు | Pay Level |
|---|---|---|
| Administrative Officer | 1 | Level-10 |
| Senior Assistant | 1 | Level-6 |
| Junior Assistant | 6 | Level-2 |
| Library Attendant | 11 | Level-1 |
| Laboratory Assistant | 9 | Level-4 |
| Laboratory Attendant | 24 | Level-1 |
| మొత్తం | 52 |
10వ తరగతి, ఇంటర్‌తో ఉద్యోగాలు
Laboratory Attendant – 24 పోస్టులు
ఈ పోస్టులకు:
- 10+2 Science చదివి ఉండాలి.
లేదా
- 10వ తరగతి పాస్ అయి ఉండాలి
- 10వ తరగతిలో Science ఒక సబ్జెక్టుగా ఉండాలి
- Laboratory Technologyలో Skill Certificate లేదా సంబంధిత ITI ఉండాలి.
ఈ పోస్టుకు Pay Level-1, గరిష్ఠ వయసు 32 సంవత్సరాలు.
Library Attendant – 11 పోస్టులు
ఈ పోస్టుకు:
- 10+2 / ఇంటర్ లేదా సమానమైన అర్హత
- గుర్తింపు పొందిన సంస్థ నుంచి Certificate Course in Library Science
ఉండాలి.
ఈ పోస్టుకు Pay Level-1, గరిష్ఠ వయసు 32 సంవత్సరాలు. Computer Applicationsపై పరిజ్ఞానాన్ని కూడా అంచనా వేస్తారు.
డిగ్రీతో Junior Assistant ఉద్యోగాలు
Junior Assistant – 6 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు:
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Bachelor’s Degree
- English Typing 35 WPM లేదా Hindi Typing 30 WPM
- Computer Operationsలో ప్రావీణ్యం
ఈ పోస్టుకు Pay Level-2, గరిష్ఠ వయసు 32 సంవత్సరాలు.
Laboratory Assistant – 9 పోస్టులు
Laboratory Assistant పోస్టులకు Bachelor’s Degreeతో పాటు Laboratoryలో sophisticated scientific instrumentsను working and maintenance చేయడంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
విభాగాల వారీగా:
- Botany – 3
- Chemistry – 3
- Physics – 1
- Zoology – 2
ఈ పోస్టుకు Pay Level-4, గరిష్ఠ వయసు 32 సంవత్సరాలు.
అనుభవం University/Research Establishment/Central or State Government/PSU/Autonomous Bodies లేదా కనీసం ₹200 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న reputed private organisationలో ఉండాలి.
Senior Assistant – 1 పోస్టు
ఈ పోస్టుకు:
- Bachelor’s Degree
- Level-4 Assistant లేదా సమానమైన పోస్టులో 3 సంవత్సరాల అనుభవం
- Computer Applications, Noting & Draftingలో ప్రావీణ్యం
అవసరం.
గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు, Pay Level-6.
Administrative Officer – 1 పోస్టు
అత్యున్నత స్థాయి పోస్టుల్లో Administrative Officer ఒకటి ఉంది.
అర్హత:
- Master’s Degree
- కనీసం 55% మార్కులు లేదా సమానమైన గ్రేడ్
గరిష్ఠ వయసు 40 సంవత్సరాలు.
ఈ పోస్టుకు Pay Level-10 ఉంటుంది. Direct Recruitment ద్వారా Written Test, Interview నిర్వహించి ఎంపిక చేస్తారు.
జీతం / Pay Scale
ఈ పోస్టులకు 7th CPC ప్రకారం Pay Levels ఉన్నాయి:
- Level-10: Administrative Officer
- Level-6: Senior Assistant
- Level-4: Laboratory Assistant
- Level-2: Junior Assistant
- Level-1: Library Attendant, Laboratory Attendant
నోటిఫికేషన్ ప్రకారం వీటికి సంబంధిత admissible pay scale + admissible allowances వర్తిస్తాయి.
వయస్సు
- Administrative Officer – 40 ఏళ్లు
- Senior Assistant – 35 ఏళ్లు
- Junior Assistant – 32 ఏళ్లు
- Laboratory Assistant – 32 ఏళ్లు
- Laboratory Attendant – 32 ఏళ్లు
- Library Attendant – 32 ఏళ్లు
రిజర్వేషన్ కేటగిరీలు మరియు ఇతర అర్హత కలిగిన వర్గాలకు నిబంధనల ప్రకారం age relaxation ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
- General / UR: ₹1,000
- OBC (NCL) / EWS / Female: ₹800
- SC / ST / PwBD: ₹600
ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తే ప్రతి పోస్టుకు విడిగా అప్లికేషన్, ఫీజు చెల్లించాలి.
చివరి తేది
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది : 9 అక్టోబర్ 2026 లేదా ప్రకటన ప్రచురించిన తేదీ నుంచి రెండు వారాలు — ఏది తర్వాతైతే అది వర్తిస్తుంది. అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆ తర్వాత పూర్తి అప్లికేషన్‌ను ఆన్లైన్లో సమర్పించాలి.
ఎంపిక విధానం
పోస్టును బట్టి Recruitment Examination, Skill Test, Interview వంటి దశలు ఉంటాయి. అభ్యర్థుల అర్హతలు, అనుభవం, పరీక్షలు/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.
Official Notification : Click Here





