కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు మంచి అవకాశం. Indian Coast Guardలో Coast Guard Enrolled Persons Test (CGEPT) – 01/2027, 02/2027 బ్యాచ్‌ల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకం ద్వారా మొత్తం 365 పోస్టులను భర్తీ చేయనున్నారు.
10వ తరగతి, ఇంటర్, Engineering Diploma అర్హత ఉన్న అభ్యర్థులు పోస్టును బట్టి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ SSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా జరుగుతుంది.
ఉద్యోగాల వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్‌లో రెండు బ్యాచ్‌లకు పోస్టులు ఉన్నాయి.
CGEPT 01/2027
- Navik (General Duty) – 130
- Yantrik (Mechanical) – 28
- Yantrik (Electronics) – 23
- Yantrik (Electrical) – 9
CGEPT 02/2027
- Navik (General Duty) – 130
- Navik (Domestic Branch) – 25
- Hygienist-I – 20
మొత్తం పోస్టులు: 365
Navik (GD) పోస్టుల్లో మహిళా అభ్యర్థులకు కూడా పోస్టులు ఉన్నాయని తాజా recruitment వివరాలు సూచిస్తున్నాయి.
10వ తరగతితో Navik (DB)
Navik (Domestic Branch) పోస్టుకు 10వ తరగతి పాస్ అర్హత ఉంది.
అంటే 10th qualificationతోనే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఇంటర్‌తో Navik (GD)
Navik (General Duty) పోస్టుకు:
- 12వ తరగతి / Inter పాస్
- Mathematics, Physics సబ్జెక్టులతో ఉండాలి.
కాబట్టి MPC లేదా Maths, Physicsతో 12th పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టుకు అర్హత పొందవచ్చు.
Diplomaతో Yantrik ఉద్యోగాలు
Yantrik పోస్టులకు సంబంధిత Engineering Diploma అవసరం.
అర్హతలో ప్రధానంగా:
- Mechanical
- Electrical
- Electronics
- Telecommunication / సంబంధిత specified Engineering branches
ఉన్న Diploma qualificationలను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
కాబట్టి సంబంధిత Engineering Diploma పూర్తి చేసిన అభ్యర్థులు Yantrik పోస్టులకు అప్లై చేయవచ్చు.
జీతం ఎంత?
ఈ ఉద్యోగాలకు పోస్టును బట్టి Pay Level ఉంటుంది.
- Navik: Basic Pay ₹21,700 – Pay Level-3
- Hygienist-I: Basic Pay ₹21,700 – Pay Level-3
- Yantrik: Basic Pay ₹29,200 – Pay Level-5 + Yantrik Pay
దీనికి అదనంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే allowances, ఇతర ప్రయోజనాలు ఉంటాయి.
వయసు
పోస్టు, బ్యాచ్‌ను బట్టి Date of Birth eligibility వేర్వేరుగా ఉంటుంది.
ఉదాహరణకు:
- Navik GD – 01/2027 & 02/2027: 1 నవంబర్ 2005 నుంచి 1 మే 2009 మధ్య జన్మించిన వారు
- Yantrik – 01/2027: 1 మే 2005 నుంచి 1 మే 2009 మధ్య
- Navik DB – 02/2027: 1 నవంబర్ 2005 నుంచి 1 అక్టోబర్ 2009 మధ్య
- Hygienist-I – 02/2027: 1 నవంబర్ 2002 నుంచి 1 అక్టోబర్ 2009 మధ్య
రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
ఈ రిక్రూట్‌మెంట్‌లో పలు దశల్లో ఎంపిక ఉంటుంది.
- Computer Based Examination
- సంబంధిత Assessment/Adaptability Tests
- Physical Fitness Test
- Document Verification
- Medical Examination
- Final Merit
అభ్యర్థులు రాత పరీక్షతో పాటు Physical Fitness, Medical Standardsకు కూడా సిద్ధంగా ఉండాలి.
పరీక్ష ఎప్పుడు?
CGEPT రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన Stage-I పరీక్ష నవంబర్ 2026లో నిర్వహించే అవకాశం ఉంది. అధికారికంగా Indian Coast Guard recruitment pageలో ఈ బ్యాచ్‌ల registration 6 అక్టోబర్ 2026 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించారు.
ఎలా అప్లై చేయాలి?
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. Indian Coast Guard కూడా CGEPT 01/27 & 02/27 applications కోసం SSC వెబ్‌సైట్‌ను ఉపయోగించాలని అధికారికంగా సూచించింది. ఆఫీసియల్ నోటిఫికేషన్ క్రింద ఇచ్చాను చెక్ చేసుకోగలరు.
Official Notification : Click Here





