ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర విద్యాశాఖ పరిధిలోని విద్యాసంస్థ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. మిజోరంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లో నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్, ఆఫీస్ అటెండెంట్ పోస్టులు కలిపి మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. పదవిని బట్టి డిగ్రీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, 10వ తరగతి అర్హతలు అవసరం.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 పోస్టులను భర్తీ చేయనున్నారు.
- టెక్నికల్ అసిస్టెంట్ – 1 పోస్టు
- స్టెనోగ్రాఫర్ – 1 పోస్టు
- టెక్నీషియన్ – 1 పోస్టు
- ఆఫీస్ అటెండెంట్ – 2 పోస్టులు
విద్య అర్హతలు
టెక్నికల్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సైన్స్, ఆర్ట్స్ లేదా కామర్స్‌లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
స్టెనోగ్రాఫర్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీలో నిమిషానికి కనీసం 80 పదాల షార్ట్‌హ్యాండ్ వేగం ఉండాలి.
టెక్నీషియన్: కింది అర్హతల్లో ఏదో ఒకటి ఉండాలి.
- సైన్స్ విభాగంలో 10+2లో కనీసం 60 శాతం మార్కులు.
- 10+2లో కనీసం 50 శాతం మార్కులతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం ఐటీఐ.
- పదో తరగతిలో కనీసం 60 శాతం మార్కులతో పాటు సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ల ఐటీఐ సర్టిఫికెట్.
- గుర్తింపు పొందిన సంస్థ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా.
ఆఫీస్ అటెండెంట్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణత ఉండాలి.
వయస్సు
- టెక్నికల్ అసిస్టెంట్ – గరిష్ఠంగా 30 సంవత్సరాలు
- స్టెనోగ్రాఫర్ – గరిష్ఠంగా 27 సంవత్సరాలు
- టెక్నీషియన్ – గరిష్ఠంగా 27 సంవత్సరాలు
- ఆఫీస్ అటెండెంట్ – గరిష్ఠంగా 27 సంవత్సరాలు
కనీస వయస్సు 18 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. వయస్సును 30 నవంబర్ 2026 నాటికి లెక్కిస్తారు.
జీతం
ఎంపికైన వారికి 7వ వేతన సంఘం పే లెవల్ ప్రకారం కనీస బేసిక్ పే ఈ విధంగా ఉంటుంది.
- టెక్నికల్ అసిస్టెంట్ – లెవల్ 6, రూ.35,400
- స్టెనోగ్రాఫర్ – లెవల్ 4, రూ.25,500
- టెక్నీషియన్ – లెవల్ 3, రూ.21,700
- ఆఫీస్ అటెండెంట్ – లెవల్ 1, రూ.18,000
ఇవి కనీస బేసిక్ వేతనాలు మాత్రమే. నిబంధనల ప్రకారం వర్తించే ఇతర అలవెన్సులు అదనంగా ఉంటాయి.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపికకు పోటీ రాత పరీక్ష నిర్వహిస్తారు. అవసరాన్ని బట్టి స్క్రీనింగ్ పరీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉంది. స్టెనోగ్రాఫర్ వంటి పోస్టులకు సంబంధిత నైపుణ్య పరీక్షలు ఉండవచ్చు. గ్రూప్-B, గ్రూప్-C పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పరీక్షలో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.
దరఖాస్తు ఫీజు
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ.1,000
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు – రూ.500
- మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఫీజును ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. చెల్లింపు రసీదును దరఖాస్తుతో పాటు పంపాలి.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు NIT మిజోరం అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్, ఎక్సెల్ డేటా షీట్, విద్యార్హతలు, కుల ధ్రువపత్రాలు, ఇతర అవసరమైన పత్రాల స్వీయ ధృవీకరణ చేసిన ప్రతులను PDF లేదా Word రూపంలో ఇమెయిల్ ద్వారా పంపాలి.
దరఖాస్తు పంపాల్సిన ఇమెయిల్: recruitmentnonteaching2026@nitmz.ac.in
ముఖ్యమైన తేది
దరఖాస్తులు పంపడానికి చివరి తేది 30 నవంబర్ 2026, సాయంత్రం 5 గంటల వరకు. చివరి తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.
Official Notification : Click Here





