Latest Indian Bank Notification 2026 | ఇండియన్ బ్యాంక్ లో 1500 ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో శిక్షణ పొందాలనుకునే గ్రాడ్యుయేట్లకు ఇండియన్ బ్యాంక్ మంచి అవకాశం కల్పించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్‌ల నియామకానికి తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 1,500 అప్రెంటిస్ శిక్షణ స్థానాలను భర్తీ చేయనుంది.
ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో నెలకు రూ.12,300 నుంచి రూ.15,000 వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 5 నుంచి ప్రారంభమయ్యాయి. చివరి తేదీ నవంబర్ 25, 2026.

ఉద్యోగ వివరాలు

  • సంస్థ పేరు: ఇండియన్ బ్యాంక్
  • పోస్టు పేరు: అప్రెంటిస్
  • మొత్తం ఖాళీలు: 1,500
  • నియామక సంవత్సరం: 2026–27
  • శిక్షణ కాలం: 12 నెలలు
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
  • స్టైపెండ్‌: నెలకు రూ.12,300 నుంచి రూ.15,000 వరకు

రాష్ట్రాల వారీగా ఖాళీలు

మొత్తం 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అప్రెంటిస్ స్థానాలను కేటాయించారు.

రాష్ట్రంఖాళీలు
ఆంధ్రప్రదేశ్85
తెలంగాణ46
తమిళనాడు270
కర్ణాటక35
కేరళ44
మహారాష్ట్ర70
ఉత్తరప్రదేశ్285
పశ్చిమ బెంగాల్145
బీహార్80
మధ్యప్రదేశ్65
ఒడిశా42
రాజస్థాన్40
గుజరాత్35
హర్యానా32
ఢిల్లీ32
అస్సాం30
ఉత్తరాఖండ్20
జార్ఖండ్60
పంజాబ్45
ఛత్తీస్‌గఢ్10
పుదుచ్చేరి9
హిమాచల్ ప్రదేశ్6
జమ్మూ కాశ్మీర్3
గోవా2
చండీగఢ్2
మణిపూర్2
నాగాలాండ్2
అరుణాచల్ ప్రదేశ్1
మేఘాలయ1
త్రిపుర1
మొత్తం1,500

ఆంధ్రప్రదేశ్‌లో 85, తెలంగాణలో 46 అప్రెంటిస్ స్థానాలు ఉన్నాయి.

విద్య అర్హతలు

అభ్యర్థులు భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

డిగ్రీ ఫలితాలు 2022 ఏప్రిల్ 1 నుంచి 2026 నవంబర్ 1 మధ్య ప్రకటించబడి ఉండాలి.

అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు NATS 2.0 పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అక్కడ ప్రొఫైల్ వివరాలను పూర్తిగా నమోదు చేసిన తర్వాతే ఇండియన్ బ్యాంక్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.

వయస్సు

2026 నవంబర్ 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

స్టైపెండ్‌ వివరాలు

ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో పోస్టింగ్ ప్రాంతాన్ని బట్టి నెలవారీ స్టైపెండ్‌ చెల్లిస్తారు.

  • గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలు: రూ.12,300
  • పట్టణ, మెట్రో ప్రాంతాలు: రూ.15,000

ఈ అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కాలం 12 నెలలు. ఇది సాధారణ శాశ్వత బ్యాంకు ఉద్యోగం కాదు. అప్రెంటిస్‌షిప్‌ చట్టం ప్రకారం శిక్షణ అవకాశంగా పరిగణించాలి.

ఎంపిక విధానం

అభ్యర్థులను కింది దశల ద్వారా ఎంపిక చేస్తారు.

  1. ఆన్‌లైన్ రాత పరీక్ష
  2. స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష
  3. ధ్రువపత్రాల పరిశీలన
  4. వైద్య పరీక్ష

ఆన్‌లైన్ పరీక్షలో రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

స్థానిక భాషా పరీక్షలో అభ్యర్థి ఎంచుకున్న రాష్ట్రానికి సంబంధించిన భాషపై అవగాహనను పరిశీలిస్తారు. ఆ రాష్ట్రానికి అవసరమైన స్థానిక భాషను పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ స్థాయిలో చదివినట్లు ధ్రువపత్రం సమర్పిస్తే, నిబంధనల ప్రకారం భాషా పరీక్ష నుంచి మినహాయింపు ఉండవచ్చు.

దరఖాస్తు ఫీజు

  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు: రూ.800 + జీఎస్టీ
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు: రూ.175 + జీఎస్టీ

ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు ముందుగా NATS 2.0 అధికారిక పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రొఫైల్‌ను పూర్తిగా నమోదు చేసి, ఆ తర్వాత ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లోని కెరీర్స్ విభాగం ద్వారా అప్రెంటిస్ దరఖాస్తును సమర్పించాలి.

దరఖాస్తు సమయంలో విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు, రాష్ట్రం, స్థానిక భాషకు సంబంధించిన వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాన్ని మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన తేదిలు

  • నోటిఫికేషన్ తేది : 2026 నవంబర్ 4
  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2026 నవంబర్ 5
  • దరఖాస్తుకు చివరి తేది : 2026 నవంబర్ 25

Official Notification : Click Here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment