Latest RRB Notification 2026 | ఇంటర్ తో రైల్వే లో 1688 ఉద్యోగాలు

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ అభ్యర్థులకు మంచి అవకాశం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC–Undergraduate) పోస్టుల భర్తీకి CEN 07/2026 నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1,688 పోస్టులను భర్తీ చేయనున్నారు.

కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి ప్రారంభ బేసిక్ పే నెలకు రూ.19,900 నుంచి రూ.21,700 వరకు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2026 నవంబర్ 13

ఉద్యోగ వివరాలు

  • సంస్థ: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB)
  • నోటిఫికేషన్ నంబర్: CEN 07/2026
  • ఉద్యోగాల పేరు: NTPC అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు
  • మొత్తం ఖాళీలు: 1,688
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
  • ఉద్యోగ స్థలం: భారతీయ రైల్వే పరిధిలోని వివిధ ప్రాంతాలు

పోస్టుల వారీగా ఖాళీలు

పోస్టు పేరుఖాళీలుపే లెవెల్ప్రారంభ బేసిక్ పే
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్700లెవెల్-3రూ.21,700
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్200లెవెల్-2రూ.19,900
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్600లెవెల్-2రూ.19,900
ట్రైన్స్ క్లర్క్188లెవెల్-2రూ.19,900
మొత్తం1,688

విద్య అర్హతలు

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. సాధారణంగా కనీసం 50 శాతం మార్కులు అవసరం.

అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, అలాగే ఇంటర్మీడియట్ కంటే ఎక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులకు 50 శాతం మార్కుల నిబంధన నుంచి నోటిఫికేషన్‌లో పేర్కొన్న మినహాయింపులు వర్తిస్తాయి.

అభ్యర్థులు నిర్దేశించిన చివరి తేదీ 2026 నవంబర్ 13 నాటికి విద్యార్హతను పూర్తి చేసి ఉండాలి.

వయస్సు

2027 జనవరి 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

  • ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
  • దివ్యాంగ అభ్యర్థులకు: కేటగిరీని బట్టి 10 నుంచి 15 సంవత్సరాల వరకు
  • మాజీ సైనికులకు: నోటిఫికేషన్‌లోని నిబంధనల ప్రకారం

జీతం

ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం పే మ్యాట్రిక్స్ ప్రకారం జీతం చెల్లిస్తారు.

  • కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: ప్రారంభ బేసిక్ పే రూ.21,700
  • అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: ప్రారంభ బేసిక్ పే రూ.19,900
  • జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: ప్రారంభ బేసిక్ పే రూ.19,900
  • ట్రైన్స్ క్లర్క్: ప్రారంభ బేసిక్ పే రూ.19,900

వీటికి వర్తించే రైల్వే అలవెన్సులు అదనంగా ఉంటాయి.

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక కింది దశల ద్వారా జరుగుతుంది.

  1. మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1)
  2. రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-2)
  3. ధ్రువపత్రాల పరిశీలన
  4. వైద్య పరీక్ష

ఈ నోటిఫికేషన్‌లో టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహణను తొలగించినట్లు పేర్కొన్నారు. అయితే అభ్యర్థులు ఎంపికైన పోస్టుకు సంబంధించిన వైద్య ప్రమాణాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

పరీక్ష విధానం

CBT-1: జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

CBT-2: ఇదే ప్రధాన అంశాలపై మరింత విస్తృతంగా ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ నిబంధన కూడా వర్తిస్తుంది.

పరీక్షల తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు తర్వాత ప్రకటిస్తాయి.

దరఖాస్తు ఫీజు

  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు: రూ.500
  • ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు, ఈబీసీ అభ్యర్థులు: రూ.250

CBT-1 పరీక్షకు హాజరైన అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఫీజులో కొంత మొత్తం తిరిగి చెల్లిస్తారు. బ్యాంకు ఛార్జీలు వర్తించవచ్చు.

ముఖ్యమైన తేదిలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 2026 అక్టోబర్ 15
  • దరఖాస్తుకు చివరి తేది : 2026 నవంబర్ 13, రాత్రి 11:59 గంటల వరకు
  • ఫీజు చెల్లింపునకు చివరి తేది : 2026 నవంబర్ 15
  • దరఖాస్తు సవరణ గడువు: 2026 నవంబర్ 16 నుంచి 25 వరకు

ఎలా దరఖాస్తు చేయాలి?

  1. ముందుగా RRB అధికారిక దరఖాస్తు వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in ను సందర్శించాలి.
  2. CEN 07/2026 NTPC అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్‌ను ఎంచుకోవాలి.
  3. కొత్త అభ్యర్థులు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
  4. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు నమోదు చేయాలి.
  5. అవసరమైన ఫొటో, సంతకం, ఇతర పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  6. దరఖాస్తు ఫీజు చెల్లించి ఫారాన్ని సబ్మిట్ చేయాలి.
  7. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ కాపీని భద్రపరచుకోవాలి.

Official Notification : Click Here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment