Telangana Ration Cards Cancelled 2025 :
తెలంగాణ లో 2023 ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలో ఆక్రమించిన స్థలాలను స్వాధీనం చేసుకునేలా హైడ్రా నీ నియమించిన విషయం అందరికీ తెలిసిందే. అలానే ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.తెలంగాణ రాష్ట్రంలో వాడుకలో లేని 78,842 రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇన్ని వేల కార్డులను రద్దు చేయడానికి గల ప్రధాన కారణాలను అధికారులు వివరించారు. రేషన్ కార్డు కలిగినటువంటి కార్డుదారులు గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోకపోవడం వల్ల ఆ కార్డుదారుల యొక్క రేషన్ కార్డులను రద్దు చేసినట్లుగా తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం, అర్హతలు ఉన్న వారిని మరలా గుర్తించి సమీక్షించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వరుసగా 6 నెలలు ( లేదా ) అంత కంటే ఎక్కువ నెలలు రేషన్ తీసుకొని కార్డులు రద్దు చేస్తున్నారు.
TS Ration Cards Cancelled 2025 Reason :
ఎందుకు రద్దు చేశారు?:
రేషన్ కార్డుదారులు సుదీర్ఘకాలంగా ( గత ఆరు నెలలు లేదా పైగా ) రేషన్ తీసుకోకపోవడం, రేషన్ కార్డు ని వినియోగించకపోవడం వల్ల, వారికి ఆ ప్రభుత్వం ద్వారా మంజూరయ్యే రేషన్ కు వారు అర్హులు కాదని భావించి రేషన్ కార్డులను రద్దు చేశారు. ఇలా చేయడానికి ముఖ్య ఉద్దేశం అక్రమంగా డబ్బులు రేషన్ తీసుకునే వారిని నియంత్రించడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
4 జిల్లాల్లో ఎక్కువగా రేషన్ కార్డులు రద్దు చేశారు?:
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ముఖ్యం 4 జిల్లాలలో అధికంగా రేషన్ కార్డులను రద్దు చేశారు. హైదరాబాద్ , రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాలలో అత్యధికంగా రేషన్ కార్డులను రద్దు చేశారు. ప్రత్యేకంగా పౌరసరఫరాల శాఖ, జిల్లా కలెక్టర్లకు తెలియజేసి ఈ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు సమాచారం
రేషన్ కార్డు పోకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి? :
రేషన్ కార్డు రద్దు చేయడానికి ముఖ్య ఉద్దేశం అర్హత లేని వారు కూడా రేషన్ కార్డు ద్వారా బియ్యం ను తీసుకొని వాటిని బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. అలాంటి వారిని కట్టడి చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. మీ రేషన్ కార్డు రద్దు చేయకుండా ఉండాలి అంటే ప్రతి నెల రేషన్ తీసుకోవాలి, అలా కుదరని వారు 2 లేదా 3 నెలలకు ఒకసారి తప్పని సరిగా రేషన్ తీసుకుంటే మీ రేషన్ కార్డు రద్దు చేయరు.
తదుపరి కార్యాచరణ ఏమిటి?:
తెలంగాణ పౌరసరఫరాల శాఖ వారు తెలిపిన వివరాల ప్రకారం, ఈ రేషన్ కార్డులు రద్దు అయిన వారిలో అర్హులైన వారు కూడా ఉన్నట్లయితే, వారు మళ్లీ రేషన్ కార్డులకు అప్లై చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తారు. వారికి అదే కార్డు యాక్టివేట్ చేస్తారా? కొత్త కార్డు ఇస్తారా అనే దానిమీద త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. అలానే కొత్త కార్డు అప్లై చేసుకునే వారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు.
ప్రజలకు ముఖ్యమైన సూచన?:
మీరు ( లేదా ) మీ కుటుంబం రేషన్ ను వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే, మీ నికర రేషన్ గురించి మీ జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో తెలుసుకోవాలి. అవసరమైతే మీ రేషన్ కార్డును తిరిగి ఆక్టివ్ చేయించేందుకు ప్రక్రియ ప్రారంభించాలి.
TS Ration Cards Cancelled 2025 Status Check :
మీ రేషన్ కార్డు రద్దు అయిందో లేదో ఇలా చెక్ చేసుకోండి?:
👉🏻 మీరు మీ రేషన్ కార్డు స్థితిని (active / dormant / cancelled) అధికారిక Telangana e-PDS వెబ్‌సైట్‌లోను, MeeSeva / T App Folio లోను ఈ విధంగా తెలుసుకోవచ్చు:
👉🏻 వెబ్సైట్ హోమ్ పేజీలో “FSC Search ” ( లేదా ) ” Ration Card Search ” ఎంపికపై క్లిక్ చేయండి
👉🏻 మీ FSC Reference Number ( లేదా ) రేషన్ కార్డు నెంబర్, జిల్లా వివరాలు ఎంటర్ చేసి సెర్చ్ చేయండి
👉🏻 స్క్రీన్ పైన రేషన్ కార్డు స్టేటస్, కుటుంబ సభ్యుల వివరాలు, కీ-వచ్చీ స్థానిక నవీకరణలు, స్థితి (Active/Dormant/Cancelled) స్పష్టంగా కనిపిస్తాయి.
👉🏻 స్థానిక మీ సేవ కేంద్రం లేదా మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణంలో కూడా అడిగి తెలుసుకోవచ్చు. లబ్ధిదారుని యొక్క ఆధార్ కార్డు ఆధారంగా చెక్ చేయవచ్చు.
Status Check Link : Click Here