ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అమ్మాయిలకు మరియు మహిళలకు భద్రత మరియు ఆర్థిక సాయం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది. ఈ పథకాలలో ముఖ్యమైనది ఆడబిడ్డ నిధి పథకం, ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 18 – 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళల అందరికి నెలకు 1,500 రూపాయలు ( లేదా ) సంవత్సరానికి 18,000 ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తామని ఎన్నికల హామీలలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఈ పథకం కోసం 2024 – 2025 ఆర్థిక సంవత్సరంలో 3341.82 కోట్లు నిధులు కూడా మంజూరు చేసింది.
ఈ పథకం ముఖ్య ఉద్దేశం :
18 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలను ఆర్థిక ప్రోత్సాహం
కుటుంబ ఆదాయం స్థిరంగా ఉంచడం
చదువుకునే అమ్మాయిలకు ఆర్థిక భరోసా ఇవ్వడం
ఈ స్కీమ్ కి అర్హతలు :
వయస్సు 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండి ఆంధ్ర ప్రదేశ్ నివాసి అయి ఉండాలి
ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు కలిగి ఉండాలి, చదువుతున్న మహిళలు 10వ తరగతి సర్టిఫికెట్ నీ బర్త్ సర్టిఫికెట్ గా సమర్పించాలి.
ఎలా Apply చేసుకోవాలి :
ఈ పథకం కోసం ప్రభుత్వం కొత్తగా ఆడబిడ్డ నిధి అనే ఒక వెబ్సైట్ ను ప్రారంభించింది అందులోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి ( లేదా ) మీ సేవ సెంటర్ నుండి కూడా అప్లై చేసుకోవచ్చు.
అవసరమైన డాక్యుమెట్స్ ( ఆధార్, రేషన్ కార్డు, 10th సర్టిఫికెట్ ) నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
ఆన్లైన్ ఫారం లో అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే, మీ అప్లికేషన్ కి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది దానిని నోట్ చేసుకోవాలి
ఈ పథకం కి ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది :
బడ్జెట్ 2024 – 25 గాను మొత్తం 3341.82 కోట్లు కేటాయించింది. ఇందులో BC మహిళలకు 1069.78 కోట్లు, ఇతర వెనుక బడిన వర్గాలకు 629.37 కోట్లు, మైనారిటీ మహిళలకు 83.79 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు.
ఈ పథకం ద్వారా మహిళలకు ఎలాంటి ఉపయోగం :
మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. దీనితో మహిళలు వారి కుటుంబాలు బాగుంటాయి.
ఈ పథకం ను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారు ప్రారంభించారు. మీరు అప్లై చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.
More Details & Apply Link : Clik Here