SVIMS తిరుపతిలో 300+ ప్రభుత్వ ఉద్యోగాలు: | జూనియర్ అసిస్టెంట్, క్లర్క్, బిల్లింగ్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల| Latest TTD Notification 2026

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో నడిచే శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతి పలు కేటగిరీల్లో మొత్తం 303 ఖాళీల భర్తీకి మూడు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసింది. మూడు నోటిఫికేషన్లు కూడా 13-07-2026న విడుదలయ్యాయి. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 15 నుండి ఆగస్టు 10, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Telegram Group Join Now

దరఖాస్తు వివరాలు ఒకే చోట :

• అధికారిక వెబ్‌సైట్: https://svimstpt.ap.nic.in (Jobs టాబ్)
• దరఖాస్తు ప్రారంభం: 15-07-2026
• చివరి తేదీ: 10-08-2026, రాత్రి 11:59 గంటల వరకు
• ఆన్‌లైన్ లో తప్ప మరే విధంగానూ దరఖాస్తులు స్వీకరించరు
• షరతు: హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అర్హులు (TTD ఉద్యోగుల సర్వీసు రూల్స్ ప్రకారం)

నోటిఫికేషన్ 1 : జూనియర్ అసిస్టెంట్ కేడర్ పోస్టులు – 33 ఖాళీలు

• జూనియర్ అసిస్టెంట్, స్టెనో కమ్ జూనియర్ అసిస్టెంట్, గ్యాస్ రూమ్ ఆపరేటర్, క్యాషియర్, బిల్లింగ్ క్లర్క్, రిసెప్షనిస్ట్ • • • పోస్టులు ఇందులో ఉన్నాయి.
• బ్యాక్‌లాగ్ ఖాళీలు: 10
• రెగ్యులర్ ఖాళీలు: 23
• వేతనం : 27,500 – 89,720 (పోస్టును బట్టి)

జూనియర్ అసిస్టెంట్, క్యాషియర్, బిల్లింగ్ క్లర్క్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ + కంప్యూటర్ నాలెడ్జ్ + మూడేళ్ల అనుభవం అవసరం. రిసెప్షనిస్ట్‌కు పబ్లిక్ రిలేషన్స్‌లో పీజీ డిప్లొమా, స్టెనో కమ్ జూనియర్ అసిస్టెంట్‌కు షార్ట్‌హ్యాండ్ మరియు టైప్‌రైటింగ్ అర్హతలు తప్పనిసరి.

నోటిఫికేషన్ 2 : పారామెడికల్ & నాన్-పారామెడికల్ పోస్టులు – 34 ఖాళీలు :

ఇందులో క్లినికల్ సైకాలజిస్ట్, బయో మెడికల్ ఇంజనీర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ Gr-II, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ (Gr-I & Gr-II), స్పీచ్ థెరపిస్ట్, పర్ఫ్యూజన్ టెక్నాలజిస్ట్, ఫార్మసిస్ట్ Gr-II, ఆడియోమెట్రీ టెక్నీషియన్ వంటి పారామెడికల్ పోస్టులతో పాటు మెడికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిసిటీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, నెట్‌వర్కింగ్ ఇంజనీర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఫోటోగ్రాఫర్, హెల్త్ ఇన్‌స్పెక్టర్, ఎలక్ట్రీషియన్ వంటి నాన్-పారామెడికల్ పోస్టులు ఉన్నాయి.

• పారామెడికల్: బ్యాక్‌లాగ్ 4 + రెగ్యులర్ 15 = 19
• నాన్-పారామెడికల్: బ్యాక్‌లాగ్ 1 + రెగ్యులర్ 14 = 15
• వేతనం : పోస్టును బట్టి 32,670 నుండి 57,100

ఈ నోటిఫికేషన్‌లో కూడా అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి.

నోటిఫికేషన్ 3 : స్టాఫ్ నర్స్ పోస్టులు – 236 ఖాళీలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు మాత్రమే ఈ పోస్టులు వర్తిస్తాయి.

• బ్యాక్‌లాగ్ ఖాళీలు: 24
• రెగ్యులర్ ఖాళీలు: 212
• వేతనం : 38,720 – 1,18,390

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.Sc నర్సింగ్ ఉత్తీర్ణత మరియు APనర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. లేదా ఇంటర్మీడియట్ + జనరల్ నర్సింగ్ కోర్సు (3 సంవత్సరాలు) + మిడ్‌వైఫరీ ట్రైనింగ్ (6 నెలలు) + మూడేళ్ల అనుభవం అయినా అర్హులే.

వయస్సు :

అన్ని మూడు నోటిఫికేషన్లకూ ఒకే వయో నిబంధనలు వర్తిస్తాయి:

• 01-07-2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి, గరిష్ఠంగా 42 సంవత్సరాలు మించకూడదు
• SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు
• దివ్యాంగులకు (PwBD) 10 సంవత్సరాల సడలింపు (నర్స్ పోస్టుకు మాత్రమే)
• SVIMSలో ఔట్‌సోర్సింగ్/కాంట్రాక్టు ప్రాతిపదికన 5 ఏళ్లు పైగా పనిచేస్తున్నవారికి 5 ఏళ్ల సడలింపు
• అన్ని సడలింపులు కలిపి గరిష్ఠ వయోపరిమితి 52 సంవత్సరాలు

ఎంపిక విధానం :

మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది:

• రాత పరీక్ష (75 మార్కులు): కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), 75 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, 90 నిమిషాల వ్యవధి, నెగెటివ్ మార్కింగ్ లేదు
• అనుభవం (15 మార్కులు): ప్రతి ఆరు నెలల సర్వీసుకు ఒక మార్కు చొప్పున, గరిష్ఠంగా 15 మార్కులు
• ఇంటర్వ్యూ (10 మార్కులు)

ఒక్కో పోస్టుకు పది కంటే తక్కువ దరఖాస్తులు వస్తే మార్కుల వెయిటేజీ ఆధారంగా నేరుగా ఎంపిక చేస్తారు; పది కంటే ఎక్కువ వస్తేనే CBT నిర్వహిస్తారు. కనీస అర్హత మార్కులు OC/EWSకు 40%, BCకు 35%, SC/ST/PwBDకు 30%గా నిర్ణయించారు.

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

3 thoughts on “SVIMS తిరుపతిలో 300+ ప్రభుత్వ ఉద్యోగాలు: | జూనియర్ అసిస్టెంట్, క్లర్క్, బిల్లింగ్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల| Latest TTD Notification 2026”

  1. నా పేరు ఎం భార్గవి ఇంటర్ సెకండియర్ కంప్లీటెడ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను

    Reply
  2. I am gudepu anilkumar
    Det of birth 16/06/1993
    10th calls pas
    Kattavarigudem vi
    Garidypalli m
    Suryapet district
    Telangana state
    Pin 508201

    Reply

Leave a Comment