RRB కొత్త నోటిఫికేషన్ | సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు దరఖాస్తు చేయండి, జీతం రూ.35,400 | Latest RRB Notification 2026

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీ కోసం సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN) నెంబర్ 03/2026ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ జోనల్ రైల్వేలలో మొత్తం 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Telegram Group Join Now

ముఖ్యమైన తేదిలు :

• నోటిఫికేషన్ విడుదల తేదీ: 27.06.2026
• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15.07.2026 (00:00 గంటలకు)
• దరఖాస్తుకు చివరి తేదీ: 14.08.2026 (రాత్రి 11:59 వరకు)
• ఫీజు చెల్లింపు చివరి తేదీ: 16.08.2026
• అప్లికేషన్ మాడిఫికేషన్ విండో: 17.08.2026 నుంచి 26.08.2026 వరకు
• వివరాలు సమర్పించాల్సిన తేదీలు: 27.08.2026 నుంచి 31.08.2026 వరకు

CBT మరియు ఇతర దశల తేదీలను RRB వెబ్‌సైట్‌లలో తర్వాత ప్రకటిస్తారు.

పోస్టు వివరాలు :

• పోస్టు పేరు: సెక్షన్ కంట్రోలర్
• 7వ పే కమిషన్ లెవెల్: 6
• ప్రారంభ వేతనం: రూ. 35,400
• మెడికల్ స్టాండర్డ్: A-2
• మొత్తం ఖాళీలు: 119

వయస్సు (01.07.2026 నాటికి) :

• కనిష్ట వయసు: 20 సంవత్సరాలు
• గరిష్ట వయసు: 33 సంవత్సరాలు (జనరల్/EWS)
• OBC-NCLకు 3 ఏళ్లు, SC/STకు 5 ఏళ్లు వయో సడలింపు వర్తిస్తుంది. ఎక్స్-సర్వీస్‌మెన్, PwBD అభ్యర్థులకు నిబంధనల ప్రకారం అదనపు సడలింపు ఉంటుంది.

విద్య అర్హత :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. ఫలితం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు కారు.

దరఖాస్తు ఫీజు :

• జనరల్ అభ్యర్థులకు: రూ. 500 (CBTకు హాజరైతే రూ. 400 తిరిగి చెల్లిస్తారు)
• మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఎక్స్-సర్వీస్‌మెన్, SC/ST, మైనారిటీ, EBC, PwBD అభ్యర్థులకు: రూ. 250 (CBTకు హాజరైతే తిరిగి చెల్లిస్తారు)

ఎంపిక ప్రక్రియ :

• సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) – 120 నిమిషాలు, 100 ప్రశ్నలు
• కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)
• డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
• మెడికల్ ఎగ్జామినేషన్

CBTలో తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. CBTలో 70% వెయిటేజ్, CBATలో 30% వెయిటేజ్‌తో మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.

దరఖాస్తు ఎలా చేయాలి :

అభ్యర్థులు తమకు నచ్చిన RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి కేవలం ఒక్క RRBకు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటి కంటే ఎక్కువ RRBలకు దరఖాస్తు చేస్తే అన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి.

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment