దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ( Clerk) నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 11,403 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది కేంద్ర ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగం సాధించే మంచి అవకాశం.
ప్రతి ఏడాది లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూసే ఈ నోటిఫికేషన్‌కు ఈసారి కూడా భారీ స్పందన ఉండే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పార్టిసిపేటింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో Customer Service Associate (Clerk) పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు :
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 11,403 పోస్టులు భర్తీ చేయనున్నారు. రాష్ట్రాల వారీ, బ్యాంకుల వారీ ఖాళీల వివరాలను IBPS అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
ఉద్యోగం పేరు :
- Customer Service Associate (CSA) – (IBPS Clerk )
విద్య అర్హత :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- కంప్యూటర్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.
- దరఖాస్తు చేసే రాష్ట్ర స్థానిక భాషపై అవగాహన ఉండాలి. ( AP, తెలంగాణ వారికి తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి )
వయస్సు :
- 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- SC, ST, OBC, PwBD తదితర వర్గాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది.
- Preliminary Examination
- Main Examination
ప్రీలిమ్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు.
ముఖ్యమైన తేదిలు :
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 01 ఆగస్టు 2026
- చివరి తేదీ: 21 ఆగస్టు 2026
- ప్రిలిమ్స్ పరీక్ష: అక్టోబర్ 2026
- మెయిన్స్ పరీక్ష: డిసెంబర్ 2026
- తుది కేటాయింపు: మార్చి 2027
జీతం :
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ బ్యాంకు నిబంధనల ప్రకారం నెలకు సుమారు రూ.40,000 వరకు (బ్యాంకు, పోస్టింగ్ ప్రాంతాన్ని బట్టి) జీతభత్యాలు, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి.
ఎందుకు ఈ నోటిఫికేషన్ ప్రత్యేకం?
- 11,000కుపైగా బ్యాంకు ఉద్యోగాలు
- డిగ్రీ అర్హతతో అవకాశం
- దేశవ్యాప్తంగా పోస్టింగులు
- ప్రభుత్వ బ్యాంకులో శాశ్వత ఉద్యోగం
- మంచి జీతం, ప్రమోషన్ అవకాశాలు
Official Notification : Click Here





