Schemes

Udyogini Scheme 2023 | నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ | ఒక లక్ష సబ్సిడీ ఇస్తున్నారు

జాబ్ లేని నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని స్టార్ట్ చేసింది. ఈ పథకం ద్వారా జాబ్ లేని నిరుద్యోగులు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళు చేసే వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణం తో పాటు సబ్సిడీ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఈ పథకం ఎంటి దీనికి ఎవరు అర్హులు, Apply చేయాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎక్కడ Apply చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం. ఇటువంటి మరిన్ని పథకాలు మరియు డైలీ జాబ్ అప్డేట్స్ కోసం క్రింద ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

నిరుద్యోగులు ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెట్టడానికి అవసరం అయ్యే నిధులు సమకూర్చుకోవాలని చూస్తున్న వారికి వడ్డీ రహిత రుణాలను అందించేదే ఈ పథకం. ఈ పథకం పేరు ఉద్యోగిని పథకం (Udyogini Scheme). ముఖ్యంగా మహిళలు రూ.3 లక్షల వరకు రుణం పొంది.. 88 రకాల చిన్న చిన్న వ్యాపారాలు నెలకొల్పుకొని ఆర్థికంగా స్థిరపడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ఈ ఉద్యోగిని పథకం (Udyogini Scheme). అవసరమైన అర్హతా ప్రమాణాలున్న దరఖాస్తుదారులు ఈ పథకం కింద రూ. 3 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే.. వైకల్యమున్న మహిళలు, వితంతువులకు రుణ పరిమితి లేదు. వారు నెలకొల్పే వ్యాపారం, వారి అర్హతలను బట్టి ఇంకా ఎక్కువ రుణం పొందవచ్చు.

ALSO READ  AP & TS Postal GDS 2nd Merit List Pdf File Link | పోస్టల్ 30,041 ఉద్యోగాల 2nd మెరిట్ లిస్ట్ వచ్చేసింది

కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ కార్యక్రమ లక్ష్యాల్లో నిరుద్యోగులకు ఆర్థిక స్వావలంబన కోసం ఆర్థిక సహాయం అందించడమూ ఒకటి. మహిళలు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగి తమ కాళ్లపై తాము నిలదొక్కుకోవడానికి ప్రవేశపెట్టిన పథకమే ఉద్యోగిని (Udyogini Scheme). ఈ పథకాన్ని మొదట కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ.. తరువాత కేంద్ర ప్రభుత్వం దీన్ని వుమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో దేశమంతటా అమలు చేస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 48 వేల మంది మహిళలు లబ్ధి పొంది చిన్నపాటి పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ALSO READ  YSR Navasakm Arogyasri status

వడ్డీ ఎలా ఉంటుంది ఈ స్కీమ్ కి :
వైకల్యం ఉన్నవారు, వితంతువులు, దళిత మహిళలకు పూర్తిగా వడ్డీ లేని రుణం కల్పిస్తారు. మిగిలిన వర్గాలకు చెందిన మహిళలకు 10 శాతం నుంచి 12 శాతం వడ్డీ మీద రుణం ఇస్తారు. ఈ వడ్డీ అనేది ఆ మహిళ రుణం పొందే బ్యాంకు నిబంధనలను బట్టి ఉంటుంది. అలాగే.. కుటుంబ వార్షిక ఆదాయాన్ని బట్టి 30 శాతం వరకూ సబ్సిడీ కల్పిస్తారు.

ఈ స్కీమ్ కు ఎవరు అర్హులు :

18 సంవత్సరాలు నిండిన 55 సంవత్సరాల వయసులోపు మహిళలందరూ అర్హులే.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళలు తమ క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ బాగా ఉండేలా చూసుకోవాలి.

గతంలో ఏదైనా రుణాలు తీసుకుని సరిగ్గా తిరిగి చెల్లించకుండా ఉన్నట్లయితే రుణం ఇవ్వరు.

ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం :

• పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు రెండు పాస్పోర్టు సైజు ఫోటోలు జత చేయాలి
•దరఖాస్తు చేస్తున్న వారి ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం
•దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు రేషన్ కార్డు కాపీని జతపరచాలి.
•ఆదాయ ధ్రువీకరణ పత్రం
•నివాస ధ్రువీకరణ పత్రం
•కుల ధ్రువీకరణ పత్రం
•బ్యాంకు ఖాతా పాసు పుస్తకం తదితర డాక్యుమెంట్లు సమర్పించాలి.

ALSO READ  Latest AP Govt Jobs 2023 | AP గ్రూప్ - 4 స్థాయి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Jobs In Telugu

ఈ స్కీమ్ కి Apply చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి

More Details & apply : click here

గమనిక: Udyogini Scheme కింద రుణం పొందడానికి మహిళలు తమ ప్రాంతంలోని బ్యాంకులను సంప్రదించాలి. బజాజ్ ఫైనాన్స్ లాంటి ప్రైవేటు ఆర్థిక సంస్థలు కూడా Udyogini Scheme కింద రుణాలు ఇస్తున్నాయి వారినీ సప్రదించకండి వడ్డీ రేట్లు అధికంగా ఉండే అవకాశం ఉంది
Apply చేయాలనుకునే వారు క్రింద లింక్ నీ క్లిక్ చేయగలరు.

More Details & Apply : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!