AP SI Answer Key Link | AP SI ఆన్సర్ కీ విడుదల డౌన్లోడ్ లింక్
ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 411 ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 13 నగరాలు, పట్టణాల్లోని 292 కేంద్రాల్లో ప్రిలిమినరీ రాత పరీక్షకు 1,51,243 మంది హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పేపర్-2 పరీక్ష మెయిల్ నిర్వహించారు. మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి
ప్రాథమిక పరీక్ష ఎలా ఉంది : కష్టం (లేదా) సులభం
రాష్ట్రంలో పోలీసు ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం ఆదివారం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష చాలా కష్టంగా ఉందని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా జనరల్ స్టడీస్ (పేపర్-2)లో వర్తమాన వ్యవహారాలకు సంబంధించి చాలా కష్టమైన ప్రశ్నలు వచ్చాయని తెలిపారు. చరిత్రకు సంబంధించిన ప్రశ్నల్లో సగానికిపైగా కఠినంగానే ఉన్నాయని, ఆధునిక చరిత్రపై తక్కువ ప్రశ్నలొచ్చాయని చెప్పారు. పాలిటీ నుంచి అడిగిన ప్రశ్నలు కనీస స్థాయిలోనే ఉన్నాయని, జాగ్రఫీ, ఆర్ధిక శాస్త్రం నుంచి అడిగిన ప్రశ్నలు కొంత సులువుగానే ఉన్నాయని రేపల్లెకు చెందిన అభ్యర్థిని ఒకరు వివరించారు. గతంతో పోలిస్తే భౌతిక, రసాయనశాస్త్రాల నుంచి అడిగిన ప్రశ్నలు ఓ మోస్తరుగా ఉన్నాయని విజయవాడకు చెందిన అభ్యర్థి చెప్పారు. అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ (పేపర్-1)లో అర్ధమెటిక్ విభాగం నుంచి వచ్చిన ప్రశ్నలు కఠినంగానే ఉన్నప్పటికీ, రీజనింగ్ విభాగంలోని ప్రశ్నలు కొంత సులువుగానే ఉన్నాయని ఓ అభ్యర్థి చెప్పారు. అర్థమెటిక్ విభాగంలో అడిగిన ప్రశ్నలు… గణితాన్ని ఒక సబ్జెక్ట్. చదవని అభ్యర్థులు రాయటం కష్టమేనని భీమవరా నికి చెందిన ఓ అభ్యర్ధి అభిప్రాయపడ్డారు.
మరిన్ని ఉద్యోగాలు
APSRTC లో 10th తో 5418 ఉద్యోగాలు
అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
ఒక్క జాబ్ కోసం ఎంత మంది పోటీ పడుతున్నారు :
411 ఎస్సై పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహిం చగా.. 1,71,938 మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వారిలో 1,51,243 మంది పరీక్షకు హాజరయ్యారు. అంటే ఒక్కో పోస్టుకు 267 మంది పోటీపడ్డారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి పోలీసు నియామక మండలి వెబ్సై ట్లో ప్రాథమిక “కీ” అందుబాటులో ఉంచుతామని నియామక మండలి చైర్మన్ మనీష్ కుమార్ సిన్హా.. తెలిపారు..
AP SI Answer Key ఆన్సర్ కీ విడుదల :
411 ఎస్ఐ పోస్టుల ప్రాథమిక పరీక్షకు ఆన్సర్ కీ నీ విడుదల చేశారు. ప్రాథమిక పరీక్ష రాసిన ప్రతి ఒక్కరూ ఈ ఆన్సర్ కీ నీ డౌన్లోడ్ చేసుకొని మీరు పెట్టిన ఆన్సర్స్ నీ చెక్ చేసుకోగలరు. ఈ ఆన్సర్స్ కీ కి సంబంధించి అభ్యంతరాలు 23వ తేదీ ఉదయం 11 గంటల్లోగా తెలియజేయాలన్నారు. పరీక్ష ఫలితాలను రెండు వారాల్లో విడుదల చేస్తామని తెలిపారు. ఆన్సర్ కీ లింక్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి
Answer Key pdf file link : click here
AP SI Results ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఎప్పుడు :
ప్రస్తుతం ఆన్సర్ కీ మాత్రమే విడుదల చేశారు. 2 లేదా 3 వారాలలో ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల చేస్తారు. రిజల్ట్స్ వచ్చిన వెంటనే తెలుసుకోవాలనుకుంటే పైన ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి