Court Jobs 2026 | 10వ తరగతి తో కోర్ట్ లో ఉద్యోగాలు

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరో మంచి అవకాశం వచ్చింది. కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా Office Attendant పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 17 ఖాళీలు ఉన్నాయి.

10వ తరగతి అర్హత ఉంటే అవకాశం

ఈ ఉద్యోగాలకు SSLC/10వ తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. అయితే నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండకూడదు అనే షరతు కూడా ఉంది. కాబట్టి దరఖాస్తు చేసే ముందు విద్యార్హత నిబంధనలను పూర్తిగా పరిశీలించాలి.

మొత్తం 17 ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా Office Attendant పోస్టులకు 17 ఖాళీలు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం అంచనా వేసిన vacanciesగా పేర్కొనబడ్డాయి.

జీతం ఎంత?

ఎంపికైన అభ్యర్థులకు రూ.23,000 నుంచి రూ.50,200 వరకు వేతన శ్రేణి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర ప్రయోజనాలు వర్తిస్తాయి.

వయసు ఎంత ఉండాలి?

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 1986 జనవరి 2 నుంచి 2008 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

సాధారణంగా రూ.500 దరఖాస్తు ఫీజుగా ఉంది. SC, ST అభ్యర్థులతో పాటు అర్హత కలిగిన నిరుద్యోగ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

ముఖ్యమైన తేదిలు

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23 సెప్టెంబర్ 2026
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26 అక్టోబర్ 2026
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 26 అక్టోబర్ 2026
  • ఆఫ్‌లైన్ ఫీజు చెల్లింపు ప్రారంభం: 30 అక్టోబర్ 2026
  • ఆఫ్‌లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 6 నవంబర్ 2026

ఎంపిక ఎలా ఉంటుంది?

ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. పరీక్ష తేదీని అధికారికంగా తర్వాత ప్రకటించనున్నారు. అభ్యర్థులు అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లో వచ్చే తదుపరి సమాచారాన్ని గమనించాలి.

ఎలా అప్లై చేయాలి?

అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా సంబంధిత కోర్టు రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లో One Time Registration పూర్తి చేసి, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సమర్పించాలి. ఆఫీసియల్ నోటిఫికేషన్ లింక్ క్రింద ఇచ్చాను చెక్ చేసుకోగలరు.

Official Notification : Click Here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment