ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరో అవకాశం వచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో ల్యాబ్ అసిస్టెంట్, ఇతర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హతను బట్టి 10వ తరగతి, ఇంటర్ చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
మొత్తం ఎన్ని పోస్టులు?
ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 6 పోస్టులు ఉన్నాయి.
- ల్యాబ్ అసిస్టెంట్ – కెమిస్ట్రీ: 1 పోస్టు
- ల్యాబ్ అసిస్టెంట్ – ఫిజిక్స్: 1 పోస్టు
- GE: 4 పోస్టులు
ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు 11 నెలల కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. పనితీరును బట్టి ఈ కాంట్రాక్ట్‌ను గరిష్ఠంగా 3 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది. GE పోస్టులు రెగ్యులర్ పోస్టులుగా పేర్కొన్నారు.
అర్హతలు
ల్యాబ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ):
ఇంటర్మీడియట్‌లో Chemistry ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
ల్యాబ్ అసిస్టెంట్ (ఫిజిక్స్):
ఇంటర్మీడియట్‌లో Physics ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
GE పోస్టులకు:
10వ తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి.
అదనంగా సంబంధిత అనుభవం, ఇంగ్లిష్‌లో మాట్లాడే సామర్థ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం వంటి అర్హతలు ఉన్నవారికి నోటిఫికేషన్‌లో ప్రాధాన్యత ఇచ్చారు.
జీతం ఎంత?
ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.40,800 కన్సాలిడేటెడ్ జీతం ఉంటుంది.
GE పోస్టులకు 7వ పే కమిషన్ Level-1, Cell-1 ప్రకారం ప్రారంభ వేతనం రూ.18,000గా ఉంది. దీనికి నిబంధనల ప్రకారం DA, Transport Allowance, Medical Allowance, అందుబాటులో ఉంటే Rent-Free Accommodation వంటి ప్రయోజనాలు ఉంటాయి.
వయస్సు :
ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు: 21 నుంచి 35 సంవత్సరాలు.
GE పోస్టులకు: 18 నుంచి 50 సంవత్సరాలు.
వయసును 01 సెప్టెంబర్ 2026 నాటికి లెక్కిస్తారు.
ఎంపిక విధానం
అర్హత ఉన్న అభ్యర్థులను ముందుగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా తదుపరి Skill/Practical Testకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సెలెక్షన్ సమయంలో ఒరిజినల్ విద్యార్హత, ప్రొఫెషనల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా చూపించాలి.
దరఖాస్తు ఫీజు
- Gen/OBC అభ్యర్థులకు – రూ.500
- SC/ST అభ్యర్థులకు – రూ.250
ఫీజును Demand Draft రూపంలో చెల్లించాలి.
ముఖ్యమైన తేది
దరఖాస్తుకు చివరి తేదీ: 10 అక్టోబర్ 2026
అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్ల ప్రతులతో పాటు prescribed application formను పూర్తి చేసి నిర్ణీత చిరునామాకు పంపాలి. దరఖాస్తులు 10 అక్టోబర్ 2026లోపు సంబంధిత పాఠశాలకు చేరాలి.
ఎక్కడికి పంపాలి?
Principal, Sainik School, Kapurthala, Punjab – 144 601
అప్లికేషన్‌లో దరఖాస్తు చేస్తున్న పోస్టు పేరును స్పష్టంగా పేర్కొనాలి. అలాగే సొంత మొబైల్ నంబర్, ఈమెయిల్ IDని సరిగ్గా ఇవ్వాలి. ఎంపికకు సంబంధించిన సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా కూడా పంపుతారు. ఆఫీసియల్ నోటిఫికేషన్ క్రింద ఇచ్చాను చెక్ చేసుకోగలరు.
Official Notification : Click Here




