AP Welfare Department Notification 2026 | 10th Pass అర్హులు | Attender, Lab Attendant పోస్టులు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. Directorate of Secondary Health Hospitals లో General Duty Attender మరియు Lab Attendant పోస్టులకు మొత్తం 6 vacancies కి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. చివరి తేదీ జూలై 6, 2026 కాబట్టి వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Telegram Group Join Now

పోస్టుల వివరాలు :

జనరల్ డ్యూటీ అటెండర్ : 05

ల్యాబ్ అటెండెంట్ : 01

మొత్తం : 06

ఈ పోస్టులు Contract మరియు Outsourcing basis పై భర్తీ చేస్తారు. మొదట ఒక సంవత్సరం tenure ఉంటుంది, performance బాగుంటే extend చేస్తారు.

విద్యార్హతలు :

General Duty Attender:
10వ తరగతి (SSC) లేదా దానికి సమానమైన అర్హత ఏదైనా recognized Board నుండి పాస్ అయి ఉండాలి.
Lab Attendant:
10వ తరగతి పాస్ తో పాటు Lab Attendant Course లేదా Intermediate (Lab Attendant Vocational Course) — AP Board of Intermediate Education లేదా AP Government గుర్తించిన సంస్థ నుండి పూర్తి చేసి ఉండాలి.

వయస్సు :

• గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు (01-01-2026 నాటికి లెక్కిస్తారు)
వయసు సడలింపు:
• SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు
• Ex-Servicemen కు 3 సంవత్సరాలు అదనంగా
• Physically Challenged అభ్యర్థులకు 10 సంవత్సరాలు
• అన్ని సడలింపులు కలిపి గరిష్టంగా 52 సంవత్సరాలు మించకూడదు

Application Fee :

ఫీజు ని Union Bank of India, Danavaipeta Branch, Rajamahendravaram లో ఉన్న Account లో చెల్లించాలి.
• Account Number: 010011010000065
• IFSC Code: UBIN0801003
• అకౌంట్ పేరు : District Coordinator of Hospital Services, East Godavari District

OC – 350/- మరియు SC / ST / BC – 250

ముఖ్యమైన తేదిలు :

దరఖాస్తు చివరి తేది : 06-07-2026 సాయంత్రం 5 గంటల లోపు సబ్మిట్ చేయాలి

Selection Process ఎలా జరుగుతుంది? :

మొత్తం 100 మార్కులకు Selection జరుగుతుంది:
• 75 మార్కులు — Qualifying Examination లో వచ్చిన మార్కుల ఆధారంగా
• 10 మార్కులు — Qualification తర్వాత అనుభవానికి (సంవత్సరానికి 1 మార్కు)
• 15 మార్కులు — Government లేదా PSU లో Contract / Outsourcing సేవకు
• COVID-19 సేవ చేసిన అభ్యర్థులకు అదనపు weightage లభిస్తుంది.

దరఖాస్తు ఎలా చేయాలి? :

ఈ recruitment కి Offline / Physical Application మాత్రమే accept చేస్తారు.
Step 1: www.eastgodavari.nic.in వెబ్సైట్ లో Application Form డౌన్లోడ్ చేసుకోండి
Step 2: Form పూర్తిగా నింపండి
Step 3: అవసరమైన certificates self-attest చేసి జత పెట్టండి
Step 4: Bank లో Fee చెల్లించి counterfoil receipt తీసుకోండి
Step 5: Filled application ని నేరుగా O/o DCHS, East Godavari District, Community Health Centre Campus, Kovvuru లో submit చేయండి
గమనిక: దరఖాస్తు submit చేసిన తర్వాత Acknowledgment తప్పకుండా తీసుకోండి. East Godavari జిల్లా అభ్యర్థులు మాత్రమే Apply చేయవచ్చు.

జత చేయాల్సిన Documents :

SSC Certificate లేదా Date of Birth Certificate
Qualifying Examination Marks Memos అన్ని సంవత్సరాలవి
Caste Certificate (SC/ST/BC అయితే)
EWS Certificate (వర్తిస్తే)
Study Certificates (4th నుండి 10th వరకు)
Ex-Serviceman Certificate (వర్తిస్తే)
Disability Certificate SADAREM (వర్తిస్తే)
Experience / Service Certificate (అనుభవం weightage కోసం)
Bank Fee చెల్లింపు Counterfoil Receipt

Official Notification : Click here

Leave a Comment