Income Tax Notification 2026 | ఇన్కమ్ టాక్స్ లో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs

ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT), న్యాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ మరియు ప్రైవేట్ సెక్రటరీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ITAT వివిధ బెంచ్‌లలో మొత్తం 42 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Telegram Group Join Now

ఖాళీల వివరాలు :

• సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ: 22 పోస్టులు (SC-01, ST-05, OBC-04, EWS-05, జనరల్-07, PWD కోటాలో 3)
• ప్రైవేట్ సెక్రటరీ: 20 పోస్టులు (SC-05, ST-02, OBC-00, EWS-03, జనరల్-10, PWD కోటాలో 2)

రెండు పోస్టులకూ కలిపి ఒకే దరఖాస్తు, ఒకే పరీక్ష ఉంటుంది. మెరిట్ ర్యాంక్ ఆధారంగా పోస్టు కేటాయిస్తారు.

జీతం :

• సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ: రూ. 47,600 – రూ. 1,51,100 (పే లెవెల్ 8, 7వ CPC)
• ప్రైవేట్ సెక్రటరీ: రూ. 44,900 – రూ. 1,42,400 (పే లెవెల్ 7, 7వ CPC)

రెండు పోస్టులూ గ్రూప్ ‘B’ గెజిటెడ్ కేటగిరీలోకి వస్తాయి.

విద్య మరియు ఇతర అర్హతలు :

• గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హత
• ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 120 పదాల వేగం
• కంప్యూటర్ పరిజ్ఞానం (MS Office, Excel, Page Maker వంటి సాఫ్ట్‌వేర్‌లపై పట్టు)

వయస్సు :

అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు, SC/ST/OBC అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ‘ఎంప్లాయిమెంట్ న్యూస్’లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30వ రోజు వయో పరిమితిని లెక్కిస్తారు.

ఎంపిక ప్రక్రియ :

రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది.

• పేపర్-1: జనరల్ ఇంగ్లీష్ (100 మార్కులు) – కనీసం 250 పదాల వ్యాసం, లెటర్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్, గ్రామర్
• పేపర్-2: జనరల్ నాలెడ్జ్ & రీజనింగ్ (100 మార్కులు) – జనరల్ స్టడీస్, లాజికల్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్

పరీక్ష కేంద్రాలు :

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, గౌహతి, లక్నో, అహ్మదాబాద్, హైదరాబాద్ – మొత్తం 9 నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమకు నచ్చిన రెండు కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు.

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment