ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ (Department of Women Development and Child Welfare), కాంట్రాక్టు/పార్ట్‌టైమ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. వన్ స్టాప్ సెంటర్ (OSC), డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU), చిల్డ్రన్ హోమ్, జువెనైల్ జస్టిస్ బోర్డ్ (JJB)లలో మొత్తం 6 పోస్టులను భర్తీ చేయనున్నారు
ఖాళీల వివరాలు :
కేస్ వర్కర్ : 01
మల్టీ పర్సన్ స్టాఫ్ : 02
కౌన్సిలర్ : 01
ఇన్స్ట్రుక్టర్ : 01
డేటా ఎంట్రీ ఆపరేటర్ : 01
మొత్తం 6 పోస్టులు, అన్నీ ప్రారంభంలో ఒక సంవత్సరం కాంట్రాక్టు/పార్ట్-టైమ్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. పనితీరు, పథకం కొనసాగింపును బట్టి పొడిగింపు ఉంటుంది.
జీతం :
• కేస్ వర్కర్: నెలకు రూ. 19,500
• మల్టీ-పర్పస్ స్టాఫ్: నెలకు రూ. 13,000
•కౌన్సెలర్, PT ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు వేతన వివరాలు నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా పేర్కొనలేదు, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలి
విద్య అర్హతలు :
• కేస్ వర్కర్: లా/సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్స్/సైకాలజీలో డిగ్రీతో పాటు మహిళా సంబంధిత రంగంలో 3 సంవత్సరాల అనుభవం
• మల్టీ-పర్పస్ స్టాఫ్/కుక్: అక్షరాస్యత ఉన్న మహిళలు అర్హులు, హైస్కూల్ విద్యార్హత ఉన్నవారికి ప్రాధాన్యత
• కౌన్సెలర్: సోషల్ వర్క్/సోషియాలజీ/సైకాలజీ/పబ్లిక్ హెల్త్/కౌన్సెలింగ్‌లో డిగ్రీ లేదా కౌన్సెలింగ్ అండ్ కమ్యూనికేషన్‌లో PG డిప్లొమా
• PT ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్: ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ/డిప్లొమా
• డేటా ఎంట్రీ ఆపరేటర్: ఇంటర్
దరఖాస్తు తేదిలు :
• OSC పోస్టులు (కేస్ వర్కర్, మల్టీ-పర్పస్ స్టాఫ్): 10.07.2026 ఉదయం 10:30 నుంచి 18.07.2026 సాయంత్రం 5:00 వరకు
• DCPU/చిల్డ్రన్ హోమ్/JJB పోస్టులు (కౌన్సెలర్, PT ఇన్‌స్ట్రక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్): 16.07.2026 ఉదయం 10:30 నుంచి 23.07.2026 సాయంత్రం 5:00 వరకు
ఎంపిక పక్రియ :
మెరిట్, సంబంధిత అనుభవం మరియు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు, TA/DA చెల్లించరు.
దరఖాస్తు ఎలా చేయాలి :
నిర్దేశిత ఫార్మాట్‌లో (అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యం) దరఖాస్తును, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, అనుభవ ధృవీకరణ పత్రాల స్వీయ ధృవీకరించిన కాపీలతో పాటు నేరుగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా కింది చిరునామాకు పంపాలి
జిల్లా మహిళా శిశు అభివృద్ధి అధికారి కార్యాలయం, స్వశక్తి భవనాలు, R&B అతిథి గృహం ఎదురుగా, కలెక్టర్ బంగ్లా రోడ్డు, గుంటూరు
అవసరమైన పత్రాలు: వయసు ధృవీకరణ (SSLC/జనన ధృవీకరణ పత్రం), కుల ధృవీకరణ పత్రం, విద్యార్హత సర్టిఫికెట్లు, అనుభవ ధృవీకరణ పత్రాలు, గుర్తింపు రుజువు (ఆధార్/ఓటర్ ఐడీ), రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.
అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు తమ అర్హతను జాగ్రత్తగా సరిచూసుకోవాలి. ఎంపిక కమిటీకి రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయడం లేదా మార్చే హక్కు ఉంటుంది.
Official Notification 1, Notification 2






I am interested
Hello sir/medam I am jwala sri b.tech completed
I need job
Hi I am completed 10 th
And I have a heavy driving licence
13 years experience