AP Anganwadi Notification 2026 | ఫీజు పరిక్ష లేకుండా అంగన్వాడీ లో ఉద్యోగాలు | AP Govt Jobs

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్ 8849ను విడుదల చేసింది. పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఓబులదేవచెరువు, పుట్టపర్తి మరియు నల్లచెరువు ICDS ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

Telegram Group Join Now

ఖాళీల వివరాలు :

మొత్తం 129 అంగన్‌వాడీ హెల్పర్ (AWH) ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.

ఈ ఖాళీలు OC, SC, ST, BC-A/B/C/D/E, EWS కేటగిరీలలో వివిధ గ్రామాల అంగన్‌వాడీ కేంద్రాల వారీగా రోస్టర్ పాయింట్ల ప్రకారం కేటాయించారు. పూర్తి గ్రామాల వారీ జాబితా కోసం అభ్యర్థులు సంబంధిత CDPO కార్యాలయాన్ని లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

దరఖాస్తు తేదిలు:

• దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 09.07.2026
• దరఖాస్తుకు చివరి తేదీ: 17.07.2026 సాయంత్రం 5:00 వరకు

దరఖాస్తులను సంబంధిత ICDS ప్రాజెక్టు కార్యాలయంలో (ఓబులదేవచెరువు/పుట్టపర్తి/నల్లచెరువు) పొంది, పూర్తి చేసి తిరిగి అదే కార్యాలయంలో నిర్దేశిత గడువులోపు సమర్పించాలి. గడువు తర్వాత ఏ పరిస్థితుల్లోనూ దరఖాస్తులు స్వీకరించరు.

అర్హత నిబంధనలు :

• అభ్యర్థులు మహిళలు అయి ఉండాలి, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
• వివాహితులై, అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామానికి స్థానికులై ఉండాలి
• వయస్సు : 01.07.2026 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి
• ఈ పోస్టులకు సంబంధిత SC/ST హాబిటేషన్లలో నివసించే SC/ST అభ్యర్థులు మాత్రమే అర్హులు
CDPO నిర్వహించే తెలుగు డిక్టేషన్ టెస్టులో ఉత్తీర్ణత సాధించాలి

జతపరచవలసిన పత్రాలు :

గెజిటెడ్ అధికారిచే ధృవీకరించిన కింది పత్రాలను దరఖాస్తుతో పాటు జతపరచాలి

• నివాస ధృవీకరణ పత్రం (నేటివిటీ సర్టిఫికెట్/ఆధార్ మొదలైనవి)
• 10వ తరగతి ఉత్తీర్ణత మార్కుల మెమో (పుట్టిన తేదీ, వయసు నిర్ధారణకు కూడా)
• కులం, నివాస ధృవీకరణ పత్రం (SC/ST/BC అయితే, తహసీల్దార్ జారీ చేసినది)
• వికలాంగత్వ ధృవీకరణ పత్రం (వర్తిస్తే, వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసినది)
• ఇటీవల తీసిన ఫోటో (దరఖాస్తుపై అతికించి, ఫోటోపై సంతకం చేయాలి)

ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి 10వ తరగతి పాసైన అభ్యర్థులు తప్పనిసరిగా TC/క్రెడిట్ సర్టిఫికెట్లు జతపరచాలి

గమనికలు :

• ఖాళీల వివరాల్లో మార్పులు, చేర్పులు ఉండవచ్చు. తాజా సమాచారం కోసం సంబంధిత CDPO కార్యాలయాన్ని సంప్రదించాలి.
• పిల్లల భద్రత దృష్ట్యా, మినీ అంగన్‌వాడీ వర్కర్ల ఎంపికలో వికలాంగులకు రిజర్వేషన్ నిబంధనలు పూర్తిగా మినహాయించారు. అయితే మైనర్ లోకోమోటార్ వైకల్యం ఉండి గృహ సందర్శన చేయగల సామర్థ్యం కలిగిన మహిళలకు అవకాశం ఇస్తారు.
• ఏ సమయంలోనైనా ఈ ప్రకటనను పూర్తిగా రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుంది.

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment