అలేఖ్య చిట్టి పికెల్స్ స్కామ్ | Alekhya Chitti Pickles Exposed| Alekhya Chitti Pickles Audio Leaks
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ట్రెండింగ్ టాపిక్ అలేఖ్య చిట్టి పికెల్స్. ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ సోషల్ మీడియా లో చాలా ఫేమస్ ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ పికిల్స్ బిజినెస్ ను ముగ్గురు అక్కా చెల్లెల్లు రన్ చేస్తున్నారు. ఈ బిజినెస్ ద్వారా వాళ్ళు ఎంత సంపాదించారు. వాళ్ళు ఏం చేయడం ద్వారా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నారు. వాళ్ళ బిజినెస్ కి భవిష్యత్ ఉంటుందా అనే విషయాలు తెలుసుకుందాం.
కొన్ని రోజుల క్రితం ఓ కస్టమర్ అలేఖ్య పికిల్స్‌కు హాయ్ ( Hi…) అని వాట్సాప్ లో వాళ్ళ బిజినెస్ నెంబర్ కి మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ కి రిప్లై గా అలేఖ్య నుంచి పచ్చళ్ల రేట్లు తెలియచేస్తూ ఓ మెసేజ్ వచ్చింది. అరకిలో నాన్ వెజ్ పచ్చళ్ల రేట్లు రూ.1200 ఉండటంతో.. రెండు చేతులు జోడించిన ఎమోజీలతో రిప్లయ్ ఇచ్చాడు ఆ కస్టమర్. మీ పచ్చళ్లు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని మరో మెసేజ్ చేశాడు కస్టమర్. ఆ మెసేజ్ కి రిప్లై ఇవ్వకున్న వాళ్ళ బిజినెస్ బాగుండేది. ఆ మెసేజ్ కి అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి ఘాటైన ( పొగరుగా కస్టమర్ నీ కించపరుస్తూ ) వాయిస్ మెసేజ్ వచ్చింది.
కస్టమర్ అనేవాడు దేవుడు ఏ వ్యాపారంలోనైనా ఇదే ప్రధాన సూత్రం అని చిన్న పెద్ద బిజినెస్ చేసే అందరికి తెలుసు. కొందరు కస్టమర్ లు అతి చేయవచ్చు. కానీ పద్ధతిగా రేట్ లు మరియు ఇతర విషయాలు అడిగిన వ్యక్తికి అంతే పద్ధతిగా రిప్లై ఇవ్వాలి. లేదంటే అసలకే మోసం వస్తుంది. అందుకు విరుద్దంగా వ్యవహరించి.. నెట్టింట తీవ్ర ట్రోలింగ్‌కి గురవుతుంది అలేఖ్య చిట్టి పికెల్స్. ఇంతకీ ఈమె ఎవరో మీకు తెలుసా. సోషల్ మీడియా లో బాగా పేమస్ అయిన ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమండ్రి కేంద్రంగా పచ్చళ్ల వ్యాపారం చేసే అలేఖ్య చిట్టి పికిల్స్ ఓనర్. ఓ యువతి. అతి తక్కువ కాలంలోనే తన పచ్చళ్లను బాగానే ప్రమోట్ చేసి.. మార్కెట్‌లో మంచిగా సక్సెస్ అయింది. అయితే వీరి పచ్చళ్లకు రేట్లు ఎక్కువ అని కొని వాటిని టేస్ట్ చేసి వీడియోలు తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు కస్టమర్స్. ఆ వీడియోలకు కూడా ఘాటుగానే ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియో కి నెగెటివ్ముం టాక్ రావడం తో డిలీట్ చేశారు. నుంచి టాక్ ఉంది. అయితే ఇటీవల ఆమె ఓ కస్టమర్‌కు పంపిన వాయిస్ నోట్ అభ్యంతరకంగా ఉందని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మాములుగా వీరి బిజినెస్ కి ఓ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉంది. అందులో కష్టమర్లు సంప్రదించి.. ఆర్డర్ పెడితే.. ఆయా అడ్రస్‌లకు డెలివరీ చేస్తారు. డెలివరీ చేయడానికి 200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. దీనిని కూడా చాలా మంది కస్టమర్స్ వెతిరేకించారు. అందులో ఇటీవల ఓ కస్టమర్.. ఆ వాట్సాప్ అకౌంట్‌లో పచ్చళ్ల మెనూ చూసి.. ఇంత ధరలు ఎందుకు అని ప్రశ్నించాడు. దీంతో అటు నుంచి అభ్యంతరకరంగా బూతులు తిడుతూ అలేక్య వాయిస్‌తో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ను రాయలేని విధంగా దూషించడం కరెక్ట్ కాదని చాలామంది నెటిజన్స్ & కస్టమర్స్ వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో అలేఖ్య చిట్టినే ఆ వాయిస్ పెట్టింది అంటూ ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. పరిస్థితి ఎంత సివియర్‌గా ఉందంటే.. వాళ్లు కొన్నాళ్లు ఏకంగా దుకాణం సర్దియేల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రోలింగ్ తీవ్రతకు వాళ్ల ఫోన్ నంబర్ ఆపేశారు.. అంతేకాదు ఆ వాట్సాప్ అకౌంట్ కూడా డిలీట్ చేశారు. ఇన్ స్టాలో కూడా అందుబాటులో రావడం లేదు. వాళ్ల వెబ్ సైట్ కూడా ప్రస్తుతం ఓపెన్ అవ్వడం లేదు. దీన్ని బట్టి ట్రోలింగ్ దెబ్బకు కొన్నాళ్లు వాళ్లు సైలెంట్‌గా ఉండాలని డిసైడయినట్లు అనిపిస్తుంది.
అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ ద్వారా ఎంత సంపాదించారు అనేది వాళ్ళు వెల్లడించలేదు కానీ నిపుణుల అంచనా మేరకు సుమారు 50 కోట్ల పైన సంపాదించారు అనే సమాచారం.
కష్టమర్లే దేవుళ్లని తన తండ్రి చెప్పినట్లు అలేఖ్య చిట్టి ఓ వీడియోలో చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు కస్టమర్ నీ ఇలా అగవర పరచడం ఎంత వరకు కరెక్ట్. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తే కస్టమర్స్ వీరిని నమ్ముతారా అనేది సందేహం. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ లో తెలియచేయండి.