AP వాలంటీర్ జీతం పెంపు | AP Volunteer Salary Hike
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ లకు భారీ శుభవార్త చెప్పింది. AP లోని వాలంటీర్ లకు ప్రస్తుతం నెలకు 5,000 రూపాయలు జీతం ఇస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ 5,000 జీతం నీ పెంచే పక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 2,30,000 మంది వాలంటీర్ లు ఉన్నారు. వీరందరికీ జేతంను 5,000 నుండి 10,000 కు పెంచాలని AP ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.
జీతం ఎప్పుడు పెంచుతారు :
ఇప్పటికీ వాలంటీర్ లకు జీతాలు పెంచాలి అని రిక్వెస్ట్ లు ప్రభుత్వానికి అందినట్టు చెప్పారు. ఆ రిక్వెస్ట్ నీ పరిశీలించి వారి జీతాలు పెంచాలి అని నిర్ణయించారు. డిసెంబర్ 21న AP ముఖ్య మంత్రి YS జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వాలంటీర్ జీతం పెంచే ప్రకటన జగన్ చేస్తారు. అప్పటి నుండి రూ 5000 నుండి రూ 10,000 జీతం వాలంటీర్ లకు అందుతాయి.