AP Anganwadi Recruitment 2023 | AP అంగన్వాడీ లో 5000 పైగా ఉద్యోగాలు | AP Govt Jobs
AP Anganwadi Recruitment 2023 | AP Govt Jobs 2023
ఆంధ్ర ప్రదేశ్ లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. అదే విధంగా మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను ఉంచాలని, గ్రోత్ మానిటెరింగ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. గురువారం తన క్యాంప్ మహిళాభిృద్ధి, శిశు సంక్షేమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అంగన్ వాడీల్లో అమలవుతున్న నాడు- నేడు పనులను సమీక్షిం చారు. మొదటి దశలో పది వేల అంగన్వాడీల్లో నాడు – నేడు పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. ప్రాధాన్యతా క్రమంలో మిగిలిన 45 వేల కేంద్రాల్లోనూ నాడు-నేడు. పనులను చేపట్టాలని సిఎం జగన్ ఆదేశించారు. అంగన్వాడీ సెంటర్లలో ఏయే సదుపాయాలు ఉన్నాయి? కల్పించాల్సినవి ఏంటి? అన్న దానిపై గ్రామ సచివాలయాల ద్వారా సమాచారం తెప్పించుకోవాలని సీఎం చెప్పారు. ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచర్, టాయిలెట్లు ఇలాంటి సౌకర్యాలపై సమాచారం తెప్పించుకోవాలన్నారు. ప్రతి అంగన్వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారుచేసి.. తనకు నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సంపూర్ణ పోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్ఓపీ రూపొందించాలన్నారు. పెన్షన్లు ఎంత పకడ్బందీగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అంతే సమర్థవంతంగా చేయాలన్నారు. క్రమం తప్పకుండా అంగన్వాడీలపై పర్యవేక్షణ జరగాలని సీఎం పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు అంగన్వాడీ సెంటర్లను పరిశీలిస్తూ.. అక్కడి పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీల్లో సూపర్ వైజర్లపైన కూడా పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలని సీఎం జగన్ అన్నారు. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 7th తో AP లోని జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 8th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా 5388 ప్రభుత్వ ఉద్యోగాలు
🔥 APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేసింది | 1,222 ఉద్యోగాలు
🔥 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం
ఈ సమావేశంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషాశ్రీచరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్థికశాఖ కార్యదర్శి కే వీ వీ సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (మౌలికసదుపాయాలు)కాటమనేని భాస్కర్, ఏపీస్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్ ఎండీ వీరపాండియన్, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీ అహమ్మద్ బాబు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం విజయ సునీత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ జాబ్స్ కి సంబందించిన pdf ఫైల్ లింక్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి.
Pdf file link : click here