AP Govt JobsSchemes

AP Annadata Sukhibhava Scheme Status Check 2025 | AP అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి, లేకుంటే ఇలా చేయండి

AP Annadata Sukhibhava Scheme Status Check 2025

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ స్ అంటూ మెయిన్ గా 6 హామీలను ప్రకటించింది. ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకం రైతులకు పంట పెట్టుకోవటానికి పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పథకం ఉంది. ఈ పథకానికి సంబంధించిన డబ్బు నీ ప్రభుత్వం జూన్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. అయితే ఈరోజు జూన్ 20వ తేదీ వచ్చినప్పటికీ ఇంతవరకు రైతుల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కాలేదు. అలాగే రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ కి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇంకా డిపాజిట్ కాలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం కి సంబంధించిన. పిఎం కిసాన్ ₹2,000/- రూపాయల డబ్బులతో కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించే ₹5,000 రూపాయలు కూడా కలిపి మొత్తం ₹7,000/- రూపాయల డబ్బులను అర్హులైన రైతుల అకౌంట్లో మొదటి విడత కింద జమ చేయడం జరుగుతుందని తెలిపింది. ఇలాగా ఒక సంవత్సర కాలంలో మూడు విడతల్లో ( ప్రతి 4 నెలలకు ఒకసారి ) డబ్బులు డిపాజిట్ అవుతాయని మొత్తం ₹20,000/- రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో జమ చేసి పంట పెట్టుబడికి సహాయం చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. కానీ ఇంతవరకు డబ్బులు రైతుల అకౌంట్ లో జమ కాలేదు. అయితే లబ్ధిదారుల యొక్క వివరాలు ఎలా చెక్ చేసుకోవాలి, ఈ కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం ఇప్పుడు చూసి తెలుసుకుందాం.

Telegram Group Join Now
ALSO READ  IBPS లో 6,128 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest IBPS Notification 2024 | Latest Jobs In Telugu

AP Annadatha Sukhibhava Scheme 2025 Deposit :

మూడు విడతల్లో ప్రభుత్వం డబ్బులు డిపాజిట్ చేస్తుంది :

అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలో మొత్తం ₹20,000/- రూపాయలు డిపాజిట్ చేస్తారు. ఈ డబ్బును ఎప్పుడూ ఎంత జమ చేస్తారు క్రింద ఇచ్చాను.

జూన్ 2025 – 7,000/-

ఆగస్టు 2025 – 7,000/-

నవంబర్ – 6,000/-

మొత్తం : 20,000/-

AP Annadata Sukhibhava Scheme 2025 List :

అర్హుల జాబితా విడుదల – మీ పేరు ను ఇలా చెక్ చేసుకోండి:

👉🏻 అన్నదాత సుఖీభవ పథకానికి అర్హుల జాబితా గ్రామ సచివాలయంలోనీ నోటీస్ బోర్డు లో డిస్ప్లే చేయడం జరుగుతుంది ( లేదా ) సచివాలయం సిబ్బందిని అడిగి తెలుసుకోగలరు (లేదా) MAO ( మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ ) కార్యాలయంలో లిస్టు పెట్టే అవకాశం ఉంది.
👉🏻 అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్సైట్లో మీ వివరాలను నమోదు చేసి చెక్ చేసుకోవచ్చు.

ALSO READ  AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Agriculture Department Notification 2024 | Latest AP Govt Jobs

AP Annadata Sukhibhava Scheme 2025 eKYC Process :

eKYC స్టేటస్ ను మొబైల్ లో ఎలా చెక్ చేసుకోవాలి?:

👉🏻 లబ్ధిదారుల యొక్క ఈ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను.
👉🏻 ఆ లింక్ క్లిక్ చేసి వెబ్సైట్ లోకి వెళ్ళండి, వెబ్సైట్ హోం పేజ్ లో ” beneficiary status ” పై క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయండి.
👉🏻 అప్పుడు మీ KYC పూర్తయిందా లేదా చూపిస్తుంది
👉🏻 బ్యాంక్ ఎస్ఎంఎస్ లేదా పిఎం కిసాన్ పోర్టల్ లో కూడా చూసుకోవచ్చు

డబ్బులు ఎప్పుడూ డిపాజిట్ చేస్తారు :

అన్నదాత సుఖీభవ మొదటి విడత ₹7,000/- రూపాయలు విడుదలకి సంబంధించి జూన్ 20వ తేదీన డబ్బులు విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది కానీ విడుదల చేయలేదు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 2000 రూపాయలు డిపాజిట్ అయిన తర్వాత అవి కూడా కలిపి రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలతో మొత్తం 7000 రూపాయలు విడుదల చేయాలి. కానీ ఈరోజు జూన్ 20వ తేదీ వచ్చినప్పటికీ రైతుల ఖాతాలో డబ్బులు డిపాజిట్ కాలేదు రైతులు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో kyc వెరిఫికేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం సమయం ఇచ్చింది. అయితే ఈ డబ్బులు ఒక వారం రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ  10th తో 3000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest AIIMS Notification 2023 | Latest Govt Jobs In Telugu

AP Annadatha Sukhibhava Scheme 2025 Apply Process :

కొత్తగా అప్లై చేయాలి అనుకునే వారు ఇలా చేయండి?:

👉🏻 కొత్త దరఖాస్తు ఫారంని పూర్తి చేసి గ్రామ సచివాలయంలో సబ్మిట్ చేయాలి.
👉🏻 మీ అప్లికేషన్ సంబంధిత వ్యవసాయ అధికారి ద్వారా ప్రాసెస్ అవుతుంది
కొత్తగా Applyచేయడానికి కావలసిన సర్టిఫికెట్స్:
ఆధార్ కార్డ్
రైతు యొక్క పట్టాదారు పాస్ పుస్తకం
బ్యాంక్ అకౌంట్ వివరాలు
మొబైల్ నెంబర్
రేషన్ కార్డు వివరాలు

అన్నదాత సుఖీభవ అనే పథకం ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం చేయడానికి ప్రారంభించిన ఒక బృహత్తరమైన కార్యక్రమం. ఈ డబ్బులు త్వరలో విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కసరత్తు చేస్తుంది. అప్లై చేసుకునే లింక్ స్టేటస్ చెక్ చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

Status Check & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!