ఏపీ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAMCET 2023) ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు 15 మే 2023 నుండి 20 మే 2023 తేదీల్లో జరుగనున్నాయి. ఆన్‌లైన్ విధానంలో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి.

ఇక.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలు మే 21,22 తేదీల్లో రోజుకి 4 సెషన్లలో జరగనున్నాయి. అయితే.. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు (AP EAMCET Hall Ticket 2023) విడుదలయ్యాయి. ఈ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి
AP EAPCET పరీక్ష విధానం:
ఎంసెట్ ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. మొత్తం 160 ప్రశ్నలకు 180 నిముషాల పాటు పరీక్ష జరుగుతుంది. మే చివరి వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎగ్జామ్ ప్యాట్రన్, ర్యాంకుల విధానంలో ఎటువంటి మార్పులులేవని, గత ఏడాది మాదిరిగానే ఉంటుందని, సెప్టెంబర్ రెండో వారంలోగా తరగతులు ప్రారంభించేందుకు అనుగుణంగా షెడ్యూల్ తయారు చేసినట్లు ఏపీ విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.

AP EAPCET 2023 ప్రవేశ పరీక్ష ద్వారా బీఈ, బీటెక్, బీటెక్ (బయోటెక్), బీటెక్ (డైరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీఫార్మసీ, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ, ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చనే సంగతి తెలిసిందే.
AP ఎంసెట్ ఫలితాలు ఎప్పుడంటే..?
AP ఎంసెట్ పరీక్షలు ముగిసిన రెండు వారాల్లో ఫలితాలను ప్రకటిస్తారు. ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ లేకపోవడంతో ఇంటర్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఫలితాల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. విద్యార్థుల ఎంసెట్ మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. పరీక్ష ముగిసిన రెండు రోజుల్లో ప్రాథమిక ‘కీ ’ని.. రెస్పాన్స్‌షీట్లను విడుదల చేసి 72 గంటల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ వెంటనే తుది ‘కీ’ని వెల్లడించి.. ఫలితాల ప్రక్రియను ప్రారంభిస్తారు.
AP EAMCET హల్ టికెట్ నీ డౌన్లోడ్ చేసుకోవడం కొరకు క్రింద ఇచ్చిన లింక్ నీ క్లిక్ చేసి మీ డీటైల్స్ ఎంటర్ చేసి హల్ టికెట్ నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
more details & hall Ticket : click here