Court Jobs 2026 | కోర్ట్ లో 250 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశం . కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా Junior Court Assistant పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 250 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అర్హత ఉండాలి.

మొత్తం 250 ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా Junior Court Assistant పోస్టులకు 250 ఖాళీలు ప్రకటించారు. ఈ పోస్టు Group-B Non-Gazetted కేటగిరీకి చెందినది. ఖాళీల సంఖ్య తాత్కాలికంగా (Tentative) పేర్కొన్నారు.

అర్హత ఏంటి?

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Bachelor’s Degree కలిగి ఉండాలి.
  • కంప్యూటర్ ఆపరేషన్‌పై పరిజ్ఞానం ఉండాలి.
  • కంప్యూటర్‌లో కనీసం 35 పదాలు నిమిషానికి (WPM) టైపింగ్ స్పీడ్ ఉండాలి.

వయసు ఎంత ఉండాలి?

అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. వయసును 1 సెప్టెంబర్ 2026 నాటికి లెక్కిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయో సడలింపు వర్తిస్తుంది.

జీతం ఎంత?

ఎంపికైన అభ్యర్థులకు Pay Matrix Level-6 ప్రకారం ప్రారంభ ప్రాథమిక వేతనం రూ.35,400 ఉంటుంది. దీనికి అదనంగా నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు లభిస్తాయి.

ఎంపిక ప్రక్రియ

ఈ ఉద్యోగాలకు ఎంపిక పలు దశల్లో ఉంటుంది. ప్రధానంగా:

  1. Objective Type Written Test
  2. Typing Test
  3. Descriptive Test
  4. Interview

అనే దశలు ఉంటాయి. Objective Type Testను 20 నవంబర్ 2026న నిర్వహించనున్నట్లు ప్రస్తుతం టెంటేటివ్ షెడ్యూల్‌లో పేర్కొన్నారు.

ముఖ్యమైన తేదిలు

  • నోటిఫికేషన్ విడుదల: 30 సెప్టెంబర్ 2026
  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 7 అక్టోబర్ 2026
  • దరఖాస్తుకు చివరి తేదీ: 28 అక్టోబర్ 2026
  • చివరి తేదీ సమయం: రాత్రి 11:55 గంటల వరకు
  • Objective Test: 20 నవంబర్ 2026 – తాత్కాలిక తేదీ

ఎలా అప్లై చేయాలి?

అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లో సంబంధిత Junior Court Assistant అప్లికేషన్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అవసరమైన వివరాలు, విద్యార్హతలు, డాక్యుమెంట్లు సమర్పించాలి. ఆఫీసియల్ నోటిఫికేషన్ లింక్ క్రింద ఇచ్చాను చెక్ చేసుకోగలరు.

Official Notification : Click Here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment