Gold Price updates
గత కొద్దిరోజులుగా భారీ గా ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారపు ధరలు అక్టోబర్ 18 నుంచి కొచ్చి కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. బంగారం తగ్గిందని ధనత్రయోదశి ( Dhanteras 2025 ) సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖ ఇన్వెస్టర్ అంకుల్ జువేరి ( Ankur Jhaveri ) తెలిపిన వివరాల ప్రకారం గత కొద్ది నెలలుగా బంగారం ధరల్లో నమోదైన పెరుగుదల దాదాపు 20 శాతం అసలు బంగారంతో సంబంధం లేకుండా రూపాయి విలువ డాలర్ తో పడిపోవడం వల్ల బంగారం పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రూపాయి బలహీన పడినప్పుడు అంతర్జాతీయ బంగారం ధరలు స్థిరంగా ఉన్న భారత మార్కెట్లో మాత్రమే బంగారం ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. ఇదే గత కొంత కొన్ని నెలలుగా జరుగుతుందన్నారు.

హైదరాబాద్ నగరంలో అక్టోబర్ 18వ తేదీన బంగారం ధరలను పరిశీలిస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,910 రూపాయలు తగ్గి 1,30,860 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,750 రూపాయలు తగ్గి 1,19,950 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం విషయానికొస్తే 1,440 తగ్గి 98,140 గా నమోదయింది.
విజయవాడ లోను బంగారం ధరలు చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,30,370 వద్ద ట్రేడ్ అవుతుంది . అదే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,19,500 పలుకుతుంది ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం విషయానికొస్తే 98,600గా నమోదయింది
ఇంకా కొన్ని రోజులు ఆగితే రూపాయి విలువ డాలర్ తో బలపడితే బంగారం విలువలు ఇంకా తగ్గే అవకాశం ఉంది అదే రూపాయి విలువ డాలర్ తో బలహీనపడితే బంగారం విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది మీరు బంగారం ధరలని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే బంగారం ధరలను అప్డేట్ ఇచ్చే వెబ్సైట్ లింకు నేను క్రింద ఇచ్చాను అది క్లిక్ చేసి ఎప్పటికప్పుడు ఏ నగరంలో ఎంత ప్రైజ్ ఉందో మీరు మొబైల్ లో చెక్ చేసుకోగలరు.
Gold Price Checking Website : Click Here