ICSIL Recruitment 2026 | 10th పాస్ అయిన వారికి పరీక్ష లేకుండా MTS, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. Intelligent Communication Systems India Ltd. (ICSIL) నుంచి Data Entry Operator (DEO), Multi-Tasking Staff (MTS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలను National Dental Commission (NDC) లో కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియమించనున్నారు. మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు నిర్ణయించిన తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

ఎన్ని పోస్టులు ఉన్నాయి?

ఈ రిక్రూట్‌మెంట్‌లో రెండు రకాల పోస్టులు ఉన్నాయి.

  • Data Entry Operator (DEO) – 5 పోస్టులు
  • Multi-Tasking Staff (MTS) – 5 పోస్టులు
  • మొత్తం – 10 పోస్టులు

Data Entry Operator ఉద్యోగం

DEO పోస్టుకు Graduation (డిగ్రీ) లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్న అభ్యర్థులు అర్హులు. ఈ పోస్టుకు అనుభవం అవసరం లేదు.

వయసు 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.24,356 వేతనం చెల్లిస్తారు. ఇది GNCTD కనీస వేతనాల ప్రకారం నిర్ణయించిన మొత్తం.

DEO Walk-in తేది :

తేది : 30 సెప్టెంబర్ 2026

సమయం: ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

MTS ఉద్యోగం

MTS పోస్టులకు 10వ తరగతి (Matriculation) పాస్ అయితే సరిపోతుంది. అయితే అభ్యర్థి Graduate అయి ఉండకూడదు. ఈ పోస్టుకు కూడా అనుభవం అవసరం లేదు.

వయసు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.22,411 వేతనం చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని కూడా GNCTD కనీస వేతనాల ప్రకారం నిర్ణయించారు.

MTS Walk-in తేది :

తేది : 1 అక్టోబర్ 2026

సమయం: ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

Walk-in ఎక్కడ?

DEO, MTS రెండు పోస్టులకు సంబంధించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూ ICSIL Administrative Building, 1st Floor, Above Post Office, Industrial Estate, Phase-III, New Delhi-110020లో నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులను National Dental Commission (NDC), Delhiలో డిప్లాయ్ చేస్తారు. ఉద్యోగ ప్రదేశం అవసరాన్ని బట్టి Delhi/NCRలో ఎక్కడైనా ఉండవచ్చు.

దరఖాస్తు ఫీజు ఎంత?

వాక్-ఇన్‌కు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా ICSIL One Time Registration (OTR) Fee రూ.590 చెల్లించి ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ ఫీజు నాన్-రిఫండబుల్. వాక్-ఇన్‌కు వెళ్లేటప్పుడు OTR ఫీజు చెల్లించిన ప్రూఫ్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

ఎంపిక ఎలా ఉంటుంది?

ముందుగా అభ్యర్థుల వయసు, విద్యార్హత, అనుభవం తదితర పత్రాలను పరిశీలించి అర్హులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం డిపార్ట్‌మెంట్ ఆధారంగా ఇంటర్వ్యూ/ఇంటరాక్షన్, అవసరమైతే స్కిల్ టెస్ట్ లేదా రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. వాక్-ఇన్‌కు హాజరైనంత మాత్రాన ఉద్యోగం ఖరారు కాదు.

తీసుకెళ్లాల్సిన పత్రాలు

అభ్యర్థులు వాక్-ఇన్ సమయంలో:

  • ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లు
  • జనన తేదీకి సంబంధించిన పత్రం
  • అనుభవ ధ్రువపత్రాలు వర్తిస్తే
  • అన్ని సంబంధిత పత్రాల ఒక సెట్ జిరాక్స్
  • 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు
  • OTR Fee చెల్లింపు ప్రూఫ్

Official Notification : Click Here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment