AP Govt JobsSchemes

ఆంధ్ర ప్రదేశ్ లో ఉచిత విద్యుత్ స్కీమ్ ను ప్రారంబించారు | Latest AP Govt Schemes | Free Current Scheme

ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక గొప్ప పథకం ను ప్రారంబించారు. 25 సంవత్సరాల పాటు గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఉచిత విద్యుత్ అందించే విధంగా ఒక గొప్ప పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలానే టౌన్స్ లో ఉండేవారిని నెలకు కేవలం 117 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి ప్రజల ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానల్స్ నీ ప్రభుత్వ సబ్సిడీ తో అమర్చబడతాయి. ఈ పథకం పేరు ‘పీఎం సూర్యఘర్ ముప్తి బిజిలీ యోజన'(PM Suryaghar Muft Bijili Yojana). ముఖ్యంగా పేద వారు మరియు మధ్య తరగతి కుటుంబాలపై కరెంటు భారం పడకుండా చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు చేసుకునే ప్రక్రియ, సబ్సిడీ ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Telegram Group Join Now

ముఖ్య అంశాలు:

👉🏻 ఈ పథకం పేరు: ‘పీఎం సూర్యఘర్ ముప్తి బిజిలీ యోజన’ కరెంటు బిల్లుల నుంచి విముక్తి పొందడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రారంభించాయి.
👉🏻 అర్హులైన అభ్యదృల యొక్క ఇంటి పైకప్పు పై సోలార్ ప్యానల్స్ అమర్చబడతాయి
👉🏻 ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్ అవుతుంది, ఈ విద్యుత్ ద్వారా ఆ కుటుంబానికి 25 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ లభిస్తుంది
👉🏻దీనితోపాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వమే Upfront ఖర్చులు కూడా భరిస్తుంది.
👉🏻ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.

ALSO READ  Latest AP Govt Jobs 2023 | AP పోషకాహార సంస్థలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP Govt Jobs In Telugu

అర్హులు ఎవరు :

👉🏻 ‘పీఎం సూర్యఘర్ ముప్తి బిజిలీ యోజన’ పథకం ద్వారా మీరు సోలార్ ప్యానల్స్ ని పొందాలంటే ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
👉🏻 నెలకు 250 యూనిట్లకు ( ఒక మీటర్ కి ) లోబడి విద్యుత్ను వినియోగించే కుటుంబాలు అర్హత ఉంటుంది
👉🏻 ఆ కుటుంబం యొక్క ఆదాయపరిమితి సంవత్సరానికి ₹1.5 లక్షల లోపు ఉండాలి ( రేషన్ కార్డు వెనుక భాగంలో మీ ఆదాయం ఉంటుంది చూసుకోగలరు )
👉🏻 రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, EV చార్జింగ్ స్టేషన్లు, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి 250 యూనిట్ల పరిమితి లేదు.

ఎంత ఖర్చు అవుతుంది?:

👉🏻 2 కిలో వాట్ల సోలార్ ప్యానల్స్ ధర 1,10,000 రూపాయలు అవుతుంది. దీనిలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తాయి.
👉🏻 ఇందులో కేంద్రం ఇచ్చే సబ్సిడీ ₹60,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ₹20,000 మొత్తం ₹80,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది.
👉🏻 ఈ పథకం లబ్ధి పొందే గ్రహీత యొక్క భారం సుమారుగా ₹30,000 రూపాయలు మాత్రమే

ALSO READ  ఇంటర్ వారికి తల్లికి వందనం స్కీమ్ మీద కీలక అప్డేట్ | Talliki vandanam For Intermediate Students

ఎంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది?:

👉🏻 2 కిలో వాట్ల సోలార్ ప్యానల్స్ ద్వారా నెలకు సగటున 200 నుండి 240 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్ సరిపోదు అనుకునే వారు అదనంగా 3 కిలో వాట్ ప్యానెల్స్ కోసం అప్లై చేసుకోవచ్చు, దానికి అదనంగా 18,000 రూపాయలు చెల్లించాలి.
👉🏻 ఇది మధ్యతరగతి మరియు దిగువ తరగతి కుటుంబాలకు సరిపడినంత విద్యుత్ ని ఉత్పత్తి చేసి ఇస్తుంది.
👉🏻 అదనంగా సోలార్ ప్యానెల్స్ బిగించుకోలేని వారు అదనంగా 50 యూనిట్లు వినియోగం వస్తే చార్జ్ ₹117/- మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

పథకానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి?:

👉🏻 ‘పీఎం సూర్యఘర్ ముప్తి బిజిలీ యోజన’ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ క్రింది విధానాన్ని ఫాలో అవ్వండి.
👉🏻 ఈ పథకానికి మీ ప్రాంతీయ జిల్లా కార్యాలయంలో గాని లేదా అధికారిక వెబ్సైట్లో గాని అప్లై చేసుకోవాలి, అధికార వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి.
👉🏻 ఆధార్ కార్డ్, లబ్ధిదారుని బ్యాంకు పాస్ బుక్, ఇంటి పట్టా పత్రాలు అన్ని కరెక్ట్ గా ఉండాలి.
👉🏻 Apply చేసుకున్న తరువాత అధికారులు వచ్చి ఇంటిని పరిశీలించాక అన్ని వివరాలు కరెక్ట్ గా ఉన్నట్లయితే మీకు సోలార్ ప్యానల్స్ ని అమర్చుతారు.

ALSO READ  6300 పైగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు | Latest EMRS Recruitment 2023 | Latest Jobs In Telugu

ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏమిటి?

👉🏻 ప్రజలు విద్యుత్ ఖర్చుల నుండి విముక్తి పొందవచ్చు. మీరు ఉపయోగించని విద్యుత్ ను ప్రభుత్వానికి పంపిణీ చేయొచ్చు.
👉🏻 మధ్యతరగతి కుటుంబాలు నెల నెల విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
👉🏻 దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం తగ్గుతుంది.
ఈ విషయాన్ని మీ స్నేహితులకు తెలిసేలా షేర్ చేయండి మరియు Apply చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను

Official website & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!