బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారీ శుభవార్త. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) Local Bank Officer (LBO) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 545 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 9, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంకింగ్ రంగంలో మంచి జీతంతో ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం. దేశంలోని 17 రాష్ట్రాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు.
ఉద్యోగ వివరాలు :
- సంస్థ: Punjab National Bank (PNB)
- పోస్టు: Local Bank Officer (LBO)
- మొత్తం ఖాళీలు: 545
- కేడర్: Junior Management Grade Scale-I (JMGS-I)
- ఉద్యోగ స్థలం: 17 రాష్ట్రాల్లోని PNB శాఖలు
విద్య అర్హత :
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే..
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- దరఖాస్తు చేసే రాష్ట్ర స్థానిక భాషపై ప్రావీణ్యం ఉండాలి.
వయస్సు :
- 20 నుంచి 30 సంవత్సరాల మధ్య
- రిజర్వేషన్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
జీతం :
ఎంపికైన అభ్యర్థులకు JMGS-I పే స్కేల్ ప్రకారం రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ప్రాథమిక వేతనం లభిస్తుంది. అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ, మెడికల్, ఇతర అలవెన్సులు కూడా అందిస్తారు.
ఎంపిక విధానం :
అభ్యర్థులను కింది దశల ద్వారా ఎంపిక చేస్తారు.
- ఆన్లైన్ రాత పరీక్ష
- స్క్రీనింగ్
- స్థానిక భాష ప్రావీణ్య పరీక్ష (అవసరమైతే)
- వ్యక్తిగత ఇంటర్వ్యూ
ముఖ్యమైన తేదిలు :
- దరఖాస్తుల ప్రారంభం: 20 జూలై 2026
- చివరి తేదీ: 09 ఆగస్టు 2026
- ఆన్లైన్ పరీక్ష: ఆగస్టు/సెప్టెంబర్ 2026 (తాత్కాలికం)
ఎందుకు ఈ ఉద్యోగాన్ని మిస్ కాకూడదు?
- 545 బ్యాంకు ఉద్యోగాలు
- ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగం
- డిగ్రీ అర్హతతో అవకాశం
- రూ.85,920 వరకు ప్రాథమిక వేతనం
- ప్రమోషన్, కెరీర్ గ్రోత్ అవకాశాలు
More Details & Apply link : Click Here





