లోక్ సభ తరగతి ఎన్నికల నేపథ్యంలో అత్యంత వేగంగా పదో పబ్లిక్ పరీక్షల పరీక్షాపత్రాల మూల్యాంకనం చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో మార్చి 18వ తేదీ నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ ఏడాది జరగుతున్న 10వ తరగతి పరీక్షల కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజులను చెల్లించారు. ఇందులో 2,57,952 మంది బాలురు కాగా.. 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ ఎగ్జామ్స్ కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాట్లు చేసి.. పటిష్ట భద్రత మధ్య ఈ పరీక్షలను నిర్వహించారు.

ఏప్రిల్ 3వ తేదీ నుంచే టెన్త్ పబ్లిక్ పరీక్షల స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ మొదలుకానుంది. మొత్తం తొమ్మిది రోజుల్లో వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా పరీక్షాల విభాగం కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ లెక్క ప్రకారం.. ఏప్రిల్ 11వ తేదీ నాటికి పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం పూర్తి కానుంది. 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో ఈ వ్యాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే.. గతేడాదితో పోలిస్టే ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు తొందరగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అలాగే.. ఫలితాలు కూడా కొంత ముందుగానే వెలువడనున్నాయి.

గతేడాది తెలంగాణలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 13వ తేదీ వరకు జరగాయి. ఫలితాలను మే 10వ తేదీన విడుదల చేశారు. అయితే ఈ సారి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో.. టెన్త్ పబ్లిక్ పరీక్షలు 2024 మార్చి 18వ తేదీనే మొదలయ్యాయి. అలాగే ఏప్రిల్ 2వ తేదీతో అన్ని ఎగ్జామ్స్ పూర్తి కానున్నాయి. గతేడాది ఫలితాల ప్రకటనకు 27 రోజుల సమయం పట్టింది. ఈసారి కూడా 25 నుంచి 33 రోజుల వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశం స్పష్టంగా ఉంది.
ఈ సంవత్సరం ఫలితాలు చెక్ చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి అక్కడ మీ హల్ టికెట్ నెంబర్ ఇంటర్ చేసు మీ రిజల్ట్స్ చుసుకోగలరు.
Results Link : Click Here