రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నటువంటి మీసేవ సెంటర్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించే విధంగా మీ సేవ కేంద్రాలు ప్రారంభించబడ్డాయి ఈ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు గవర్నమెంట్ మరియు నాన్ గవర్నమెంట్ సేవలు ఒకే చోట లభించునున్నాయి.
మీసేవ సెంటర్ ద్వారా ఎలాంటి సేవలు అందించబడతాయి
మీసేవ అనేది ప్రభుత్వానికి చెందిన సింగిల్ విండో సర్వీస్ సిస్టం ఇందులో పౌరులకు ఇలాంటి సేవలు అందించబడతాయి
- ఆధార్ మరియు పాన్ కార్డ్ సేవలు
- రేషన్ కార్డ్ క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్లు
- ప్రభుత్వ పథకాల దరఖాస్తులు
- ప్రభుత్వ పథకాలకు ఆన్లైన్లో అప్లై చేసే ప్రాసెస్
- విద్యుత్ చెల్లింపులు
- ప్రజల భూమికి సంబంధించి 1 బి అడంగల్ సేవలు
- ఇతర ప్రభుత్వ సేవలు
మీసేవ సెంటర్ ప్రారంభించడానికి అర్హతలు :
- విద్య అర్హత కనీసం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి దీనితో పాటు హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రింటర్ స్కానర్ మరియు బయోమెట్రిక్ పరికరాలు కలిగి ఉండాలి
- కనీసం 100 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ లేదా షాప్ కలిగిన వారికి మాత్రమే ఈ సేవ సెంటర్ అవకాశం కల్పిస్తారు
మీసేవ సెంటర్ ప్రారంభించడానికి అవసరమైన డాక్యుమెంట్స్ :
- ఆధార్ కార్డు కలిగి ఉండాలి ( లోకల్ అడ్రస్ లో మాత్రమే మీరు అప్లై చేసుకోగలరు )
- పాన్ కార్డు కలిగి ఉండాలి ( ఎవరు అప్లై చేస్తున్నారు వారికి కచ్చితంగా పాన్ కార్డు ఉండాలి )
- ఇంటర్ పాస్ అయినటువంటి మెమోస్ ఉండాలి ( డిగ్రీ సర్టిఫికెట్ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు )
- మీకు లోకల్ గా రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి
- ఒక ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి
అప్లై చేసే ప్రాసెస్ :
అప్లై చేయాలి అనుకున్న అభ్యర్థులు సంబంధిత అఫీషియల్ వెబ్సైట్లో ముందుగా మీ డీటెయిల్స్ తో రిజిస్టర్ అయి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత న్యూ మీసేవ సెంటర్ అప్లికేషన్ లింక్ పాయింట్ క్లిక్ చేయాలి అలా క్లిక్ అలా క్లిక్ చేసిన తర్వాత అక్కడ అడిగిన డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలా ఇలా సబ్మిట్ చేసిన వారు అప్లికేషన్స్ మొత్తాన్ని ప్రభుత్వం వారిచ్చిన అడ్రస్ మరియు వారి షాప్ కి సంబంధించి మొత్తం వెరిఫికేషన్ చేసి అన్ని కరెక్ట్ గా ఉన్నవారికి అప్రూవల్ చేస్తారు. అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు మీ సేవకు సంబంధించి లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది దాంతో మీరు మీ ఏరియాలో మీ సేవ సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేయగలరు
ముఖ్య తేదీలు :
ఈ నోటిఫికేషన్ కి మనం ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేయడానికి 28. 08.2025 నుండి 20.09.2025 వరకు అప్లికేషన్స్ స్వీకరించబడును. ఇన్ మీసేవ సెంటర్లకు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ మరియు అప్లై చేసే లింకు క్రింది ఇచ్చాను అక్కడి నుండి మీరు చూసుకొని అప్లై చేసుకోగలరు
MeeSeva Notification : Click Here