తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు భారీ శుభవార్త. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఈ రిక్రూట్‌మెంట్‌పై ఎట్టకేలకు స్పష్టత రావడంతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ రిక్రూట్‌మెంట్‌లో Sub Inspector (SI), Police Constable, Fire Fighter, Station Fire Officer, Deputy Jailor, Warder వంటి పలు కీలక పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉద్యోగ భద్రత, ఆకర్షణీయమైన జీతం, ప్రమోషన్ అవకాశాలు ఉండటంతో ఈ నోటిఫికేషన్‌కు భారీ పోటీ ఉండే అవకాశం ఉంది.
ఏయే శాఖల్లో నియామకాలు?
ఈ నోటిఫికేషన్ ద్వారా నాలుగు ప్రధాన శాఖల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు.
- పోలీస్ శాఖ
- Special Protection Force (SPF)
- Fire, Disaster Response, Emergency & Civil Defence
- Prisons & Correctional Services
పోస్టుల వారీగా ఖాళీలు
పోలీస్ శాఖ
- SI (Civil) – 148
- Reserve SI (AR) – 14
- Reserve SI (TGSP) – 12
- Reserve SI (SARCPL) – 3
- Assistant SI (FPB) – 23
- Police Constable (Civil) – 3,697
- Police Constable (AR) – 1,052
- Police Constable (SARCPL) – 24
- Police Constable (Driver) – 20
- Police Constable (Mechanic) – 7
Special Protection Force (SPF)
- SI – 44
- Constable – 1,380
Fire Department
- Station Fire Officer – 39
- Fire Fighter – 751
Prisons Department
- Deputy Jailor (Men) – 14
- Deputy Jailor (Women) – 1
- Warder (Male) – 196
- Warder (Female) – 12
విద్యార్హతలు :
పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి.
• Sub Inspector (SI) – గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ.
• Police Constable – ఇంటర్మీడియట్ (10+2) లేదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న సమాన అర్హత.
• Station Fire Officer – సంబంధిత విభాగంలో డిగ్రీ/టెక్నికల్ అర్హత.
• Fire Fighter – ఇంటర్మీడియట్ లేదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హత.
• Deputy Jailor – డిగ్రీ.
• Warder – ఇంటర్మీడియట్.
మొత్తం ఖాళీలు
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 7,437 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇది ఇటీవలి కాలంలో తెలంగాణలో వచ్చిన అతిపెద్ద ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లలో ఒకటిగా భావిస్తున్నారు.
దరఖాస్తులు ఎప్పుడు?
ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు, చివరి తేదీని త్వరలో ప్రత్యేక ప్రకటన ద్వారా వెల్లడిస్తామని TSLPRB తెలిపింది. దరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే స్వీకరిస్తారు.
ఇప్పటి నుంచే సిద్ధం కావాల్సింది ఏమిటి?
రిక్రూట్‌మెంట్ బోర్డు అభ్యర్థులు ముందుగానే ఫిజికల్, మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. అలాగే SC, BC, EWS, స్థానిక అభ్యర్థుల ధ్రువపత్రాలు వంటి అవసరమైన సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొంది.
ఎందుకు ఈ నోటిఫికేషన్ మిస్ కాకూడదు?
తెలంగాణలో పోలీస్, ఫైర్, జైళ్ల శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇది అరుదైన అవకాశం. ఒకేసారి వేలాది పోస్టులు భర్తీ చేస్తుండటంతో, సరైన ప్రణాళికతో సిద్ధమయ్యే అభ్యర్థులకు అవకాశాలు మెరుగ్గా ఉండొచ్చు. నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఇప్పటి నుంచే సిలబస్, ఫిజికల్ ట్రైనింగ్‌పై దృష్టి పెట్టడం ప్రయోజనకరం. ఆఫీసియల్ నోటిఫికేషన్ క్రింద ఇచ్చాను చెక్ చేసుకోగలరు
Official Notification : Click here





