AP Health Department Jobs 2026 | AP సంక్షేమ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2026

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ (DM&HO) పరిధిలోని IDSP-DSU విభాగంలో పలు పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 9 నుంచి జూలై 18, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాలు కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ విధానంలో చేపడుతున్నారు.

Telegram Group Join Now

ఈ నోటిఫికేషన్‌లో Data Manager, Data Entry Operator, Lab Assistant/Attendant వంటి పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా నిర్ణయించారు. కంప్యూటర్ పరిజ్ఞానం, సంబంధిత అర్హతలు ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

• పోస్టును బట్టి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా సంబంధిత టెక్నికల్ అర్హత ఉండాలి.
• Data Entry Operator పోస్టుకు డిగ్రీతో పాటు కంప్యూటర్ డిప్లొమా అవసరం.
• Data Manager పోస్టుకు కంప్యూటర్ సైన్స్‌లో పీజీ లేదా IT/Electronics‌లో BE అర్హతగా పేర్కొన్నారు.

వయస్సు ఎంత ఉండాలి?

2026 జూన్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 40 సంవత్సరాల లోపు ఉండాలి. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, మాజీ సైనికులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక ఎలా జరుగుతుంది?

అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మార్కులు, అనుభవానికి వెయిటేజ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. Data Manager పోస్టుకు అదనంగా కంప్యూటర్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

దరఖాస్తు తేదిలు :

• దరఖాస్తుల ప్రారంభం: 09 జూలై 2026
• చివరి తేదీ: 18 జూలై 2026

దరఖాస్తులను నిర్ణీత గడువులోగా DM&HO కార్యాలయంలో సమర్పించాలి.

More Details & Apply link : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment