Fire Department Jobs | AP లో ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA) lo జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, మెరైన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేందుకు ఫైర్ ఆఫీసర్ పోస్టు భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకం కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

ఖాళీల వివరాలు :

• పోస్టు పేరు: ఫైర్ ఆఫీసర్
• నెలవారీ వేతనం: రూ. 60,000

విద్య అర్హతలు :

• గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూషన్ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ
• లైట్ మరియు హెవీ వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి

వయస్సు మరియు శారీరక ప్రమాణాలు :

• వయస్సు : 18 నుంచి 40 సంవత్సరాల మధ్య
• కనిష్ట ఎత్తు: 167 సెం.మీ.
• ఛాతీ (సాధారణ): కనిష్టం 81 సెం.మీ.
• ఛాతీ (విస్తరణ): కనిష్టం 5 సెం.మీ.
• బరువు: కనిష్టం 50 కేజీలు

అవసరమైన సామర్థ్యాలు :

• ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కంప్యూటర్లు & MS ఆఫీస్ వినియోగంలో నైపుణ్యం
• పోర్ట్ ప్రాంతంలో అన్ని ఫైర్ ఫైటింగ్, ఫైర్ ప్రివెన్షన్ ఏర్పాట్లను నిర్వహించగలగాలి
• ఫైర్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ పనిని పర్యవేక్షించగలగాలి, ఫైర్ ఫైటింగ్ యూనిట్లను మంచి స్థితిలో ఉంచడంలో సలహా ఇవ్వగలగాలి
• పోర్ట్ ప్రాంతంలో ప్రమాదకర సరుకు నిర్వహణ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించగలగాలి
• విశాఖపట్నంలోని ఇతర ఫైర్ ఫైటింగ్ సర్వీసులతో సమన్వయం చేసుకోగలగాలి, సివిల్ డిఫెన్స్ ప్లాన్ తయారీలో సహాయపడగలగాలి

కాంట్రాక్టు నిబంధనలు :

• కాంట్రాక్టు కాలవ్యవధి: ప్రారంభంలో ఒక సంవత్సరం, పనితీరు ఆధారంగా పోర్ట్ అథారిటీ విచక్షణతో ఎన్నిసార్లయినా పొడిగించవచ్చు
• నెలకు రూ. 60,000 కన్సాలిడేటెడ్ వేతనం మాత్రమే చెల్లిస్తారు, ఇతర ప్రయోజనాలు వర్తించవు
• రోజుకు కనీసం 8 గంటలు (జనరల్/షిఫ్ట్‌లు) విధులు నిర్వహించాలి
• క్యాలెండర్ సంవత్సరానికి 12 రోజుల సెలవు (ప్రొ-రేటా ప్రాతిపదికన) అనుమతిస్తారు
• CMO/VPA ధృవీకరించిన మెడికల్ ఫిట్‌నెస్ ప్రకారం పీరియాడికల్ ఫిట్‌నెస్ టెస్టులు చేయించుకోవాలి
• కుటుంబంతో నివసించాలనుకుంటే స్టాండర్డ్/మార్కెట్ రెంట్‌పై టైప్-IV క్వార్టర్ కేటాయిస్తారు (బ్యాచిలర్ వసతి లేదు)
• మొబైల్ ఫోన్ రీచార్జ్ కోసం నెలకు రూ. 500 వరకు రీయింబర్స్‌మెంట్ లభిస్తుంది
• ఉద్యోగం మానుకోవాలనుకుంటే ఒక నెల ముందస్తు నోటీసు ఇవ్వాలి

దరఖాస్తు తేది :

దరఖాస్తుకు చివరి తేదీ: 10.08.2026

అర్హతను నిర్ధారించే క్రూషియల్ తేదీ నోటిఫికేషన్ తేదీ అయిన 09.07.2026గా పరిగణిస్తారు.

దరఖాస్తు ఎలా చేయాలి :

అభ్యర్థులు మోడల్ అప్లికేషన్ ఫార్మాట్ (Annexure-I) ప్రకారం దరఖాస్తును తయారు చేసి, విద్యార్హత, అనుభవం, వయసుకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్ల స్వీయ ధృవీకరించిన ఫోటోకాపీలతో పాటు కింది చిరునామాకు పంపాలి

సెక్రటరీ, 1వ ఫ్లోర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, విశాఖపట్నం-530035

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment