విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA) lo జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, మెరైన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేందుకు ఫైర్ ఆఫీసర్ పోస్టు భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకం కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
ఖాళీల వివరాలు :
• పోస్టు పేరు: ఫైర్ ఆఫీసర్
• నెలవారీ వేతనం: రూ. 60,000
విద్య అర్హతలు :
• గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూషన్ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ
• లైట్ మరియు హెవీ వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
వయస్సు మరియు శారీరక ప్రమాణాలు :
• వయస్సు : 18 నుంచి 40 సంవత్సరాల మధ్య
• కనిష్ట ఎత్తు: 167 సెం.మీ.
• ఛాతీ (సాధారణ): కనిష్టం 81 సెం.మీ.
• ఛాతీ (విస్తరణ): కనిష్టం 5 సెం.మీ.
• బరువు: కనిష్టం 50 కేజీలు
అవసరమైన సామర్థ్యాలు :
• ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కంప్యూటర్లు & MS ఆఫీస్ వినియోగంలో నైపుణ్యం
• పోర్ట్ ప్రాంతంలో అన్ని ఫైర్ ఫైటింగ్, ఫైర్ ప్రివెన్షన్ ఏర్పాట్లను నిర్వహించగలగాలి
• ఫైర్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ పనిని పర్యవేక్షించగలగాలి, ఫైర్ ఫైటింగ్ యూనిట్లను మంచి స్థితిలో ఉంచడంలో సలహా ఇవ్వగలగాలి
• పోర్ట్ ప్రాంతంలో ప్రమాదకర సరుకు నిర్వహణ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించగలగాలి
• విశాఖపట్నంలోని ఇతర ఫైర్ ఫైటింగ్ సర్వీసులతో సమన్వయం చేసుకోగలగాలి, సివిల్ డిఫెన్స్ ప్లాన్ తయారీలో సహాయపడగలగాలి
కాంట్రాక్టు నిబంధనలు :
• కాంట్రాక్టు కాలవ్యవధి: ప్రారంభంలో ఒక సంవత్సరం, పనితీరు ఆధారంగా పోర్ట్ అథారిటీ విచక్షణతో ఎన్నిసార్లయినా పొడిగించవచ్చు
• నెలకు రూ. 60,000 కన్సాలిడేటెడ్ వేతనం మాత్రమే చెల్లిస్తారు, ఇతర ప్రయోజనాలు వర్తించవు
• రోజుకు కనీసం 8 గంటలు (జనరల్/షిఫ్ట్‌లు) విధులు నిర్వహించాలి
• క్యాలెండర్ సంవత్సరానికి 12 రోజుల సెలవు (ప్రొ-రేటా ప్రాతిపదికన) అనుమతిస్తారు
• CMO/VPA ధృవీకరించిన మెడికల్ ఫిట్‌నెస్ ప్రకారం పీరియాడికల్ ఫిట్‌నెస్ టెస్టులు చేయించుకోవాలి
• కుటుంబంతో నివసించాలనుకుంటే స్టాండర్డ్/మార్కెట్ రెంట్‌పై టైప్-IV క్వార్టర్ కేటాయిస్తారు (బ్యాచిలర్ వసతి లేదు)
• మొబైల్ ఫోన్ రీచార్జ్ కోసం నెలకు రూ. 500 వరకు రీయింబర్స్‌మెంట్ లభిస్తుంది
• ఉద్యోగం మానుకోవాలనుకుంటే ఒక నెల ముందస్తు నోటీసు ఇవ్వాలి
దరఖాస్తు తేది :
దరఖాస్తుకు చివరి తేదీ: 10.08.2026
అర్హతను నిర్ధారించే క్రూషియల్ తేదీ నోటిఫికేషన్ తేదీ అయిన 09.07.2026గా పరిగణిస్తారు.
దరఖాస్తు ఎలా చేయాలి :
అభ్యర్థులు మోడల్ అప్లికేషన్ ఫార్మాట్ (Annexure-I) ప్రకారం దరఖాస్తును తయారు చేసి, విద్యార్హత, అనుభవం, వయసుకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్ల స్వీయ ధృవీకరించిన ఫోటోకాపీలతో పాటు కింది చిరునామాకు పంపాలి
సెక్రటరీ, 1వ ఫ్లోర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, విశాఖపట్నం-530035
Official Notification : Click here





