AP KGBV Notification 2026 | AP KGBV లో 913 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు మంచి అవకాశం. రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) వివిధ పోస్టుల భర్తీకి అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం 913 ఖాళీల్లో అసిస్టెంట్, వార్డెన్, హెల్పర్ పోస్టులు ఉన్నట్లు సమాచారం.

ఈ ఉద్యోగాలకు పోస్టును బట్టి 7వ తరగతి, పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్హతలు నిర్ణయించారు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు. ఎంపిక ప్రక్రియలో మెరిట్‌కు ప్రాధాన్యత ఇస్తారు.

ఖాళీల వివరాలు

KGBVల్లో మొత్తం 913 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇందులో మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి.

  • అసిస్టెంట్
  • వార్డెన్
  • హెల్పర్

విద్య అర్హతలు

పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి.

హెల్పర్: కనీసం 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వార్డెన్: పదో తరగతి ఉత్తీర్ణత అవసరం.

అసిస్టెంట్: ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సు సడలింపులకు సంబంధించిన వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడిస్తారు.

ఎంపిక విధానం

ఈ పోస్టులకు అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల విద్యార్హతలు, సంబంధిత ధ్రువపత్రాలను పరిశీలించి ఎంపిక ప్రక్రియ చేపడతారు.

దరఖాస్తు విధానం

దరఖాస్తు చేసుకునే అభ్యద్రులు అప్లికేషన్ ఫారం ని డైరెక్ట్ గా వెళ్లి సమర్పించాలి.

Official Notification : Click Here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment