SVIMS Notification 2026 | ఫీజు పరీక్ష లేకుండా తిరుపతి లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) మంచి అవకాశం కల్పిస్తోంది. సంస్థలో నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) కింద మొత్తం 81 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ అందించడంతో పాటు నెలకు రూ.21,500 స్టైపెండ్‌ చెల్లిస్తారు.

  • సంస్థ: శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS)
  • పోస్టు పేరు: అప్రెంటిస్
  • మొత్తం ఖాళీలు: 81
  • శిక్షణ కాలం: ఒక సంవత్సరం
  • నెలవారీ స్టైపెండ్‌: రూ.21,500
  • ఉద్యోగ స్థలం: తిరుపతి
  • ఎంపిక విధానం: వాక్-ఇన్ ఇంటర్వ్యూ

ఖాళీల వివరాలు

మొత్తం 81 ఖాళీలను కేటగిరీల వారీగా కేటాయించారు.

  • ఓసీ: 17
  • బీసీ-ఏ: 9
  • బీసీ-బీ: 13
  • బీసీ-డీ: 9
  • ఈడబ్ల్యూఎస్: 5
  • ఎస్సీ గ్రూప్-1: 1
  • ఎస్సీ గ్రూప్-2: 9
  • ఎస్సీ గ్రూప్-3: 10
  • ఎస్టీ: 8

విద్య అర్హత :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఎస్సీ డిగ్రీ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీని రెగ్యులర్ విధానంలో 2022 లేదా ఆ తర్వాత పూర్తి చేసి ఉండాలి.

అభ్యర్థులు సంబంధిత రాష్ట్ర కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. అలాగే NATS పోర్టల్‌లో నమోదు చేసుకోవడం తప్పనిసరి.

ఇప్పటికే అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తి చేసినవారు లేదా ప్రస్తుతం శిక్షణ పొందుతున్నవారు ఈ నియామకానికి అర్హులు కారు.

వయస్సు :

2026 జూన్ 30వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు.
  • బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు.
  • దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.

స్టైపెండ్‌ వివరాలు

ఎంపికైన అభ్యర్థులకు నెలకు మొత్తం రూ.21,500 చెల్లిస్తారు.

  • SVIMS నుంచి: రూ.15,350
  • NATS నుంచి: రూ.6,150
  • మొత్తం: రూ.21,500

శిక్షణ కాలం ఒక సంవత్సరం ఉంటుంది. ఇది అప్రెంటిస్‌షిప్ శిక్షణ మాత్రమే. శిక్షణ పూర్తయిన తర్వాత సంస్థలో శాశ్వత ఉద్యోగం లభిస్తుందని హామీ లేదు.

ఎంపిక విధానం

అభ్యర్థులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అర్హత కలిగినవారు అవసరమైన ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. పత్రాల పరిశీలన అనంతరం ఎంపిక ప్రక్రియ చేపడతారు.

వాక్-ఇన్ ఇంటర్వ్యూ వివరాలు

  • తేదీ: 2026 నవంబర్ 23
  • సమయం: ఉదయం 9:00 నుంచి 11:30 గంటల వరకు
  • వేదిక: రెండో అంతస్తు, శ్రీ పద్మావతి ఆడిటోరియం, SVIMS OPD
  • చిరునామా: SVIMS, అలిపిరి రోడ్, తిరుపతి – 517507

నిర్ణీత సమయం తర్వాత వచ్చే అభ్యర్థులకు ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం ఉండదు.

తీసుకెళ్లాల్సిన డాకుమెంట్స్

  • విద్యార్హత సర్టిఫికెట్లు
  • మార్కుల మెమోలు
  • సంబంధిత కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
  • NATS రిజిస్ట్రేషన్ వివరాలు
  • ఆధార్ కార్డు
  • పాన్ కార్డు
  • బ్యాంకు ఖాతా వివరాలు, చెక్‌బుక్
  • కుల ధ్రువపత్రం (వర్తిస్తే)
  • రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు

అసలు ధ్రువపత్రాలతో పాటు వాటి ఫొటోకాపీలను కూడా తీసుకెళ్లాలి. బ్యాంకు ఖాతా ఆధార్‌తో అనుసంధానమై, డీబీటీ సౌకర్యం కలిగి ఉండాలి.

Official Notification : Click Here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment