AP Sachivalayam 3rd Notification 2023 | AP గ్రామ / వార్డ్ సచివాలయంలో 13,995 ఉద్యోగాలు
AP Sachivalayam 3rd Notification 2023 | 13,995 Vacancies :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీగా ఖాళీలు నెలకొన్నాయి. తాజాగా 13,995 ఖాళీలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిల్లో కొన్ని శాఖలు మినహా మిగిలిన వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. సచివాలయాలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపైనా దృష్టి సారిస్తోంది. ఈ మేరకు అన్ని శాఖలకూ ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీల్లో అధికంగా పశుసంవర్ధక శాఖలోనే కనిపిస్తున్నాయి. ఈ శాఖలో 4,765 పశుసంవర్తక సహాయకుల ఖాళీలు ఉండగా, విద్యుత్ శాఖలో గ్రేడ్ – 2 ఖాళీలు 1,127 ఉన్నట్లు తేలింది. ఉద్యానవన సహాయకుల పోస్టులు 1,496, గ్రేడ్-3 మహిళా పోలీస్ పోస్టులు 1092, గ్రామ సర్వేయర్ సహాయకుల పోస్టులు 1,027 ఖాళీగా ఉన్నాయి.
AP Sachivalayam 3rd Notification 2023 Vacancies Overview :
మొత్తం ఖాళీల్లో ఏవి అవసరమున్నాయి, వేటిని త్వరగా భర్తీ చేయాలి, ఎందులో తదుపరి నియామకాలు అవసరం లేదన్నదానిపైనా ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. మహిళా పోలీస్, గ్రామ సర్వేయర్ సహాయకు లు, మున్సిపల్, పట్టణాభి వృద్ధి శాఖ పరిధిలోకి వచ్చే వార్డు సౌకర్యాల కార్యదర్శులు, ప్లానింగ్, రెగ్యులేటరీ కార్యదర్శి, పారిశుధ్యం, పర్యావరణం, విద్య, వార్డు పాలన, వార్డు సంక్షేమానికి సంబంధించిన కార్యదర్శుల పోస్టుల ఖాళీలను భర్తీ చేయరాదని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇటువంటి ఖాళీలే 3,905 వరకు ఉన్నట్లు తేలింది. మరికొన్ని పోస్టులను స్థానిక భౌగోళిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత భర్తీ చేయాలని నిర్ణయించారు.
AP Sachivalayam 3rd Notification Full Details :
జాబ్ చార్టు లేని పోస్టులు
దాదాపు ఎనిమిది కీలక శాఖల్లో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టులకు ఇంకా జాబ్ చార్టు కూడా ఖరారు కాలేదు. ఇవి ఆయా శాఖల ఉన్నతాధికారుల వద్దనే పెండింగ్ లో ఉన్నట్లు తేలింది. సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని సంక్షేమం – విద్య సహాయకులను ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించుకోలేక, అంతర్ శాఖలతో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ నివేదిక రాకపోవడంతో వారికి జాబ్ చార్టు ఖరారు చేయలేదు. వ్యవసాయం, ఉద్యానవనం, విద్యుత్, అంగన్వాడీ పోస్టుల జాబ్ చార్టు అంశం ఆయా శాఖాధిపతుల వద్దనే ఇంకా పెండింగ్లో ఉండగా, పట్టు శాఖకు సంబంధించి ఆ శాఖ మంత్రి వద్దనే పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.