Canara Bank Jobs 2026 | కెనరా బ్యాంక్ లో 3500 ఉద్యోగాలు

డిగ్రీ పూర్తి చేసిన యువతకు Canara Bank గుడ్ న్యూస్ చెప్పింది. 2026-27 సంవత్సరానికి సంబంధించి 3,500 Graduate Apprentice పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

ఎవరు అప్లై చేయొచ్చు?

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే డిగ్రీని 2023 జనవరి 1 నుంచి 2026 సెప్టెంబర్ 1 మధ్య పూర్తి చేసి ఉండాలి.

అభ్యర్థుల వయస్సు 2026 సెప్టెంబర్ 1 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

నెలకు రూ.16,650 స్టైపెండ్

ఈ అప్రెంటిస్‌షిప్ కాలవ్యవధి 12 నెలలు. ఎంపికైన వారికి నెలకు మొత్తం రూ.16,650 స్టైపెండ్ లభిస్తుంది.

ఇందులో Canara Bank నుంచి రూ.10,500, ప్రభుత్వం నుంచి DBT ద్వారా రూ.6,150 చెల్లిస్తారు.

అయితే ఇది రెగ్యులర్ Canara Bank ఉద్యోగం కాదు. అప్రెంటిస్‌షిప్ పూర్తయిన తర్వాత రెగ్యులర్ ఉద్యోగం ఇస్తామని బ్యాంక్ ఎలాంటి హామీ ఇవ్వలేదు.

అప్లికేషన్ ఎప్పటి నుంచి?

అభ్యర్థులు 2026 అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లై చేసే ముందు అభ్యర్థులు NATS apprenticeship portalలో రిజిస్టర్ చేసుకోవాలి. NATSలో ప్రొఫైల్ 100 శాతం పూర్తిగా ఉండాలి.

అలాగే అభ్యర్థులు అప్రెంటిస్‌షిప్ కోసం ఒక రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక ఎలా ఉంటుంది?

అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది. అవసరమైన చోట స్థానిక భాషపై పరీక్ష కూడా ఉంటుంది.

అందువల్ల తెలంగాణలో పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు తెలుగు/ఉర్దూ స్థానిక భాష అర్హతను కూడా నోటిఫికేషన్‌లో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

ముఖ్యమైన తేదిలు

నోటిఫికేషన్: విడుదలైంది
దరఖాస్తుల ప్రారంభం: 1 అక్టోబర్ 2026
దరఖాస్తులకు చివరి తేదీ: 17 అక్టోబర్ 2026
అప్రెంటిస్‌షిప్ వ్యవధి: 12 నెలలు
మొత్తం పోస్టులు: 3,500

తెలుగు రాష్ట్రాల గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశం

డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఈ అప్రెంటిస్‌షిప్ ఒక అవకాశంగా ఉంటుంది.

Official Notification : Click Here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment