బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Institute of Banking Personnel Selection (IBPS) CRP CSA-XVI (మునుపటి IBPS Clerk) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో Customer Service Associate (CSA) పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో నియామకాలు జరగనున్నాయి.
డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ప్రతి ఏడాది లక్షల మంది ఎదురుచూసే IBPS నోటిఫికేషన్ కావడంతో ఈసారి కూడా భారీ పోటీ ఉండే అవకాశం ఉంది.
ముఖ్యమైన తేదిలు :
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 1 ఆగస్టు 2026
- చివరి తేదీ: 21 ఆగస్టు 2026
- Preliminary Exam: అక్టోబర్ 2026
- Main Exam: డిసెంబర్ 2026
- ప్రొవిజనల్ అలాట్‌మెంట్: మార్చి 2027
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఈ నోటిఫికేషన్‌కు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి అర్హతలు, వయోపరిమితి, రాష్ట్రాల వారీ ఖాళీల వివరాలు పూర్తి నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంటాయి.
ఎంపిక ఎలా ఉంటుంది?
ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది.
- Preliminary Online Examination
- Main Online Examination
ఈ రెండు పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వ బ్యాంకుల్లో పోస్టింగ్ లభిస్తుంది.
ఎందుకు ఈ నోటిఫికేషన్ ప్రత్యేకం?
- కేంద్ర ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగం
- డిగ్రీ అర్హతతో అవకాశం
- దేశవ్యాప్తంగా పోస్టింగ్
- ఆకర్షణీయమైన జీతం, DA, HRA, ఇతర అలవెన్సులు
- కెరీర్ గ్రోత్‌కు మంచి అవకాశం
Official Notification : Click here





