10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2026 | AP Govt Jobs

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సెకండరీ హెల్త్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS), జిల్లా లోని DSH ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నంబర్ 02/2026ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ 04.07.2026న విడుదలైంది.

Telegram Group Join Now

మొత్తం ఖాళీలు – 20 పోస్టులు

• థియేటర్ అసిస్టెంట్ : 1

• పోస్ట్‌మార్టం అసిస్టెంట్ : 3

• జనరల్ డ్యూటీ అటెండెంట్ : 15

• ప్లంబర్ : 1

విద్య అర్హతలు :

• థియేటర్ అసిస్టెంట్, పోస్ట్‌మార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్: SSC/10వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత ఉండాలి.
• ప్లంబర్: SSC ఉత్తీర్ణతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుండి ITI ప్లంబింగ్ ట్రేడ్/ఫిట్టర్ ట్రేడ్/మెకానిక్ ట్రేడ్‌లో శిక్షణ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు :

• గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు (01.01.2025 నాటికి లెక్కించబడుతుంది)
వయో సడలింపులు:
• SC/ST/BC & EWS అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
• దివ్యాంగులకు (PH) – 10 సంవత్సరాలు
• మాజీ సైనికులకు – సర్వీసు కాలం + 3 సంవత్సరాలు అదనంగా

దరఖాస్తు ఫీజు :

• OC అభ్యర్థులు: ₹250/- (DD రూపంలో, DCHS శ్రీకాకుళం పేరిట)
• SC/ST/BC అభ్యర్థులు: మినహాయింపు
• దివ్యాంగులు: మినహాయింపు
ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత కలిగి ఉంటే, ప్రతి పోస్టుకూ విడిగా దరఖాస్తు చేసుకోవాలి మరియు ప్రతి పోస్టుకూ వేర్వేరుగా ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు విధానం మరియు ముఖ్యమైన తేదిలు

ఈ నియామకం పూర్తిగా ఆఫ్‌లైన్ (ఫిజికల్ అప్లికేషన్) పద్ధతిలో నిర్వహించబడుతుంది.
• దరఖాస్తు ఫారంను https://srikakulam.ap.gov.in వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
• పూర్తి చేసిన దరఖాస్తును అవసరమైన పత్రాలతో పాటు వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా DCHS శ్రీకాకుళం కార్యాలయానికి పంపాలి.
• దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 05.07.2026
• చివరి తేదీ: 09.07.2026, సాయంత్రం 5 గంటల వరకు
• గడువు తర్వాత అందిన దరఖాస్తులు ఏ కారణంతోనూ స్వీకరించబడవు. పోస్టు ఆలస్యానికి కార్యాలయం బాధ్యత వహించదు.

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment