భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) దేశవ్యాప్తంగా 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 1906 నుంచి సేవలందిస్తున్న ఈ సంస్థలో శాశ్వత ఉద్యోగం పొందేందుకు ఇది మంచి అవకాశం.
ముఖ్యమైన తేదిలు :
• ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 18.07.2026
• రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 07.08.2026
• ఆన్‌లైన్ పరీక్ష ఫేజ్-I: 27.08.2026
• ఆన్‌లైన్ పరీక్ష ఫేజ్-II: 30.10.2026
ఖాళీల వివరాలు :
మొత్తం 500 అసిస్టెంట్ పోస్టులు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో భర్తీ చేయనున్నారు.
జీతం :
• ప్రారంభ బేసిక్ పే: రూ. 36,290
• పే స్కేల్: రూ.36290-2115(1)-38405-2310(2)-43025-2600(5)-56025-3005(2)-62035-3660(3)-73015-3800(2)-80615-4050(5)-100865
• మెట్రోపాలిటన్ కేంద్రాల్లో అలవెన్సులతో కలిపి మొత్తం వేతనం సుమారు నెలకు రూ. 63,000 వరకు ఉంటుంది.
విద్య అర్హత మరియు వయస్సు (01.07.2026 నాటికి) :
• గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన అర్హత
• దరఖాస్తు చేసే రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తప్పనిసరి
• వయసు: 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి, నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది
దరఖాస్తు ఎలా చేయాలి?
పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, ఫీజు చెల్లింపు కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి
Official Notification : Click here





