ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 10వ తరగతి ఉత్తీర్ణులకు శుభవార్త. ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాలపై మరో భారీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశంపై చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 28 వేలకుపైగా నుంచి 30 వేల వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశముందని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఖాళీల సంఖ్య, దరఖాస్తు తేదీలు వంటి తుది వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే ఖరారు అవుతాయి.
ఏ పోస్టులు భర్తీ చేస్తారు?
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా సాధారణంగా కింది పోస్టులను భర్తీ చేస్తారు.
- Branch Post Master (BPM)
- Assistant Branch Post Master (ABPM)
- Gramin Dak Sevak (GDS)
ఈ పోస్టులు దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఉంటాయి.
విద్యార్హత ఏమిటి?
- 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత
- స్థానిక భాషపై పరిజ్ఞానం ( ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ మరియు తెలంగాణ వారికి తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి )
- ప్రాథమిక కంప్యూటర్ నాలెడ్జ్
- సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి (నిబంధనల ప్రకారం)
వయస్సు :
- కనీసం: 18 సంవత్సరాలు
- గరిష్టం: 40 సంవత్సరాలు
- రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
పరీక్ష లేకుండానే ఎంపిక :
GDS నియామకాల ప్రత్యేకత ఏమిటంటే రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి ఎంపిక చేస్తారు. దీంతో మంచి మార్కులు సాధించిన వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
జీతం ఎంత?
పోస్టును బట్టి వేతనం మారుతుంది.
- ABPM/GDS: సుమారు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు
- BPM: సుమారు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు
ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
Official Notice : Click here






Plese give me link bro