RRB Notification 2026 | రైల్వే లో 6557 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల | RRB Jobs

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్-III కేటగిరీల్లో మొత్తం 6,557 పోస్టుల భర్తీ కోసం CEN No. 02/2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి/ITI, డిప్లొమా, డిగ్రీ అర్హతలు ఉన్న అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్.

Telegram Group Join Now

ముఖ్యమైన తేదిలు :

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 30, 2026న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 29, 2026 రాత్రి 11:59. ఫీజు చెల్లింపుకు చివరి తేదీ జూలై 31, 2026. దరఖాస్తులో ఏవైనా మార్పులు చేసుకోవాలంటే ఆగస్టు 1 నుండి 10 వరకు అవకాశం ఉంటుంది.

పోస్టుల వివరాలు :

టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టుకు పే లెవెల్-5 వర్తిస్తుంది, వయో పరిమితి 18 నుండి 33 సంవత్సరాలు, మొత్తం 323 ఖాళీలు ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్-III కింద 25 వేర్వేరు కేటగిరీలు ఉండగా, పే లెవెల్-2 వర్తిస్తుంది, వయో పరిమితి 18 నుండి 30 సంవత్సరాలు, మొత్తం 6,234 ఖాళీలు ఉన్నాయి.

విద్య అర్హతలు :

గ్రేడ్-I సిగ్నల్ పోస్టుకు ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్‌లో బీఎస్సీ లేదా సంబంధిత ఇంజనీరింగ్ డిప్లొమా/డిగ్రీ అవసరం.

గ్రేడ్-III పోస్టులకు పదో తరగతి పాసై, సంబంధిత ట్రేడ్‌లో ITI లేదా అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన వారు అర్హులు.

దరఖాస్తు రుసుము :

జనరల్ కేటగిరీ అభ్యర్థులు ₹500 చెల్లించాలి, అందులో ₹400 CBTకి హాజరైతే వాపసు వస్తుంది. SC/ST, మహిళలు, PwBD, మైనారిటీలు, EWS అభ్యర్థులు ₹250 మాత్రమే చెల్లించాలి, ఇది CBTకి హాజరైతే పూర్తిగా వాపసు వస్తుంది.

ఎంపిక ప్రక్రియ :

మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహిస్తారు, ఇది 90 నిమిషాల వ్యవధితో 100 ప్రశ్నలతో ఉంటుంది, తప్పు సమాధానానికి 1/3rd నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. CBTలో మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్‌కు షార్ట్‌లిస్ట్ చేస్తారు.

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment