Wipro WILP Recruitment 2026 | Backlogs ఉన్నా Wipro జాబ్స్ ఇస్తుంది | Wipro Jobs

ఐటీ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న BCA, B.Sc విద్యార్థులకు ప్రముఖ ఐటీ సంస్థ విప్రో (Wipro) శుభవార్త చెప్పింది. Work Integrated Learning Program (WILP) కింద కొత్త నియామకాలను చేపడుతోంది, మొదటి నెలలోనే రూ.75 వేల జాయినింగ్ బోనస్ కూడా అందనుంది.

Telegram Group Join Now

ఈ నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు అత్యంత ఊరటనిచ్చే విషయం ఏమిటంటే.. ఒక బ్యాక్‌లాగ్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది.

ఒక బ్యాక్‌లాగ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు

చాలా కంపెనీలు బ్యాక్‌లాగ్ ఉన్న అభ్యర్థులను అనుమతించవు. అయితే విప్రో WILP నోటిఫికేషన్‌లో మాత్రం ఆన్‌లైన్ అసెస్‌మెంట్ జరిగే సమయంలో ఒక బ్యాక్‌లాగ్ వరకు అనుమతి ఇచ్చింది.

విద్యార్హతలు

  • 10వ తరగతి పాస్
  • ఇంటర్ పాస్
  • గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60% మార్కులు లేదా 6.0 CGPA
  • పూర్తి సమయ (Full-Time) డిగ్రీ అయి ఉండాలి.
  • గ్రాడ్యుయేషన్‌లో Core Mathematics సబ్జెక్ట్ తప్పనిసరి.
  • Business Mathematics, Applied Mathematicsను Core Mathematicsగా పరిగణించరు.

ఇతర అర్హతలు

  • 10వ, 12వ తరగతులకు మాత్రమే ఓపెన్ స్కూల్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనుమతి.
  • గరిష్టంగా 3 సంవత్సరాల Education Gap మాత్రమే అనుమతి.
  • గ్రాడ్యుయేషన్ సమయంలో ఎలాంటి గ్యాప్ ఉండకూడదు.
  • భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తు చేయాలి.

స్టైపెండ్ ఎంత?

  • 1వ సంవత్సరం: రూ.15,000 + ESI
  • 2వ సంవత్సరం: రూ.17,000 + ESI
  • 3వ సంవత్సరం: రూ.19,000 + ESI
  • 4వ సంవత్సరం: రూ.23,000

రూ.75 వేల జాయినింగ్ బోనస్

ఎంపికైన అభ్యర్థులకు మొదటి నెల స్టైపెండ్‌తో పాటు రూ.75,000 జాయినింగ్ బోనస్ అందజేస్తారు.

సర్వీస్ అగ్రిమెంట్

ఎంపికైన అభ్యర్థులు 5 సంవత్సరాల (60 నెలలు) సర్వీస్ అగ్రిమెంట్‌పై పని చేయాలి. ఈ గడువు పూర్తికాకముందే ఉద్యోగం వదిలేస్తే కంపెనీ నిబంధనలు వర్తిస్తాయి.

ఎంపిక విధానం

అభ్యర్థులను ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ద్వారా ఎంపిక చేస్తారు. అనంతరం కంపెనీ నిర్వహించే తదుపరి ఎంపిక దశల్లో ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పిస్తారు.

ఎందుకు ఈ అవకాశం ప్రత్యేకం?

  • ఒక బ్యాక్‌లాగ్ ఉన్నా అప్లై చేసే అవకాశం
  • ఉద్యోగంతో పాటు M.Tech చదివే అవకాశం
  • రూ.75 వేల జాయినింగ్ బోనస్
  • ప్రతి ఏడాది పెరిగే స్టైపెండ్
  • ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోలో కెరీర్ ప్రారంభించే అవకాశం

More Details & Apply link : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

1 thought on “Wipro WILP Recruitment 2026 | Backlogs ఉన్నా Wipro జాబ్స్ ఇస్తుంది | Wipro Jobs”

Leave a Comment