Sainik School Jobs 2026 | సైనిక్ స్కూల్‌లో MTS ఉద్యోగాలు | 10th పాస్‌తో అవకాశం

10వ తరగతి చదివిన అభ్యర్థులకు ప్రభుత్వ విద్యాసంస్థలో ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. కర్ణాటకలోని Sainik School Bijapurలో General Employees (MTS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులు Regular Basisపై భర్తీ చేయనున్నారు.

ఉద్యోగ వివరాలు

  • సంస్థ: Sainik School Bijapur
  • పోస్టు: General Employees (MTS)
  • మొత్తం ఖాళీలు: 5
  • కేటగిరీ: GEN – 2, OBC (NCL) – 2, ST – 1
  • ఉద్యోగం: Regular
  • దరఖాస్తు విధానం: Offline
  • పే స్కేల్: Level-1
  • Basic Pay: ₹18,000

అర్హత

ఈ MTS ఉద్యోగాలకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి.

అదనంగా Bakery, Plumbing, Carpenter, Horse Care, Housekeeping, Office Equipment Handling వంటి Multi-Skill పనులపై పరిజ్ఞానం ఉంటే ప్రాధాన్యత ఇస్తారు.

Boarding Schoolలో పనిచేసిన అనుభవం ఉంటే కూడా ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థికి Kannada, Hindi, English భాషలపై పరిజ్ఞానం ఉండాలి. శారీరకంగా ఫిట్‌గా ఉండాలి.

వయసు

18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసును 01 అక్టోబర్ 2026 నాటికి లెక్కిస్తారు.

జీతం & ఇతర ప్రయోజనాలు

MTS పోస్టుకు Level-1 Pay Matrixలో ₹18,000 Basic Pay ఉంటుంది.

నిబంధనల ప్రకారం Rent-free accommodation, Transport Allowance with DA, Medical Allowance, LTC, Bonus, New Pension Scheme వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. అలాగే పాఠశాలలో ఇద్దరు పిల్లలకు సబ్సిడీతో విద్యా సదుపాయం ఉంటుందని నోటిఫికేషన్ పేర్కొంది.

ఎంపిక విధానం

మొదట అభ్యర్థులను Shortlist చేసి, అవసరాన్ని బట్టి Written Test / Practical Test / Interviewకు పిలుస్తారు. ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది.

ఎలా అప్లై చేయాలి?

అభ్యర్థులు Sainik School Bijapur వెబ్‌సైట్ నుంచి prescribed application formను డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి వివరాలతో నింపాలి.

అటెస్టెడ్ సర్టిఫికెట్ల కాపీలు, ఫొటో, ఇతర అవసరమైన డాక్యుమెంట్లతో పాటు ₹500 Non-refundable Demand Draftను జత చేయాలి.

పూర్తి చేసిన దరఖాస్తును:

Principal, Sainik School Bijapur, Athani Road, District – Vijayapura, Karnataka – 586108

చిరునామాకు పంపాలి.

దరఖాస్తు చివరి తేది : ప్రకటన ప్రచురించిన తేదీ నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు స్కూల్‌కు చేరాలి. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులను స్వీకరించరు.

Official Notification : Click Here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment