SSC CHSL Jobs 2026 | ఇంటర్ అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

ఇంటర్ పూర్తి చేసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం వచ్చింది. Staff Selection Commission (SSC), Combined Higher Secondary (10+2) Level Examination, 2026 (CHSL) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా LDC/JSA, Data Entry Operator (DEO), DEO Grade-A పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం 2,536 ఖాళీలు తాత్కాలికంగా ప్రకటించారు. తుది ఖాళీల సంఖ్యను తర్వాత వెల్లడిస్తారు.

ఏ పోస్టులు ఉన్నాయి?

SSC CHSL 2026 ద్వారా ప్రధానంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు:

  • Lower Division Clerk (LDC)
  • Junior Secretariat Assistant (JSA)
  • Data Entry Operator (DEO)
  • Data Entry Operator Grade-A

ఈ పోస్టులు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో ఉంటాయి.

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు ప్రధానంగా ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

LDC/JSA పోస్టులకు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా సమానమైన పరీక్ష పాస్ అయి ఉండాలి.

DEO/DEO Grade-A పోస్టులకు: సాధారణంగా ఇంటర్ పాస్ అర్హత ఉంటుంది. అయితే కొన్ని నిర్దిష్ట DEO పోస్టులకు ఇంటర్‌లో Science స్ట్రీమ్‌తో Mathematics తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి DEO పోస్టుకు ప్రాధాన్యత ఇచ్చే అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని సంబంధిత పోస్టు అర్హతను తప్పనిసరిగా చెక్ చేయాలి.

వయసు ఎంత ఉండాలి?

01 ఆగస్టు 2026 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ నిబంధనల ప్రకారం SC/ST, OBC, PwBD, Ex-Servicemen తదితర కేటగిరీలకు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

జీతం ఎంత?

పోస్టును బట్టి పే లెవల్ మారుతుంది.

  • LDC/JSA: Pay Level-2 — ₹19,900 నుంచి ₹63,200
  • DEO: Pay Level-4/5 — ₹25,500 నుంచి ₹92,300 వరకు
  • DEO Grade-A: Pay Level-4 — ₹25,500 నుంచి ₹81,100

దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే అలవెన్సులు ఉంటాయి.

ఎంపిక విధానం :

SSC CHSL ఎంపిక ప్రక్రియలో Tier-I, Tier-II కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉంటాయి. పోస్టును బట్టి Typing Test లేదా Skill Test నిర్వహిస్తారు. అనంతరం Document Verification ఉంటుంది.

ముఖ్యమైన తేదిలు :

  • నోటిఫికేషన్ విడుదల: 7 సెప్టెంబర్ 2026
  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 7 సెప్టెంబర్ 2026
  • దరఖాస్తుకు చివరి తేదీ: 7 అక్టోబర్ 2026, రాత్రి 11 గంటల వరకు
  • ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 8 అక్టోబర్ 2026, రాత్రి 11 గంటల వరకు
  • Application Correction: 14 నుంచి 16 అక్టోబర్ 2026
  • Tier-I పరీక్ష: తేదీని SSC తర్వాత ప్రకటిస్తుంది.

దరఖాస్తు ఫీజు :

జనరల్, OBC, EWS కేటగిరీల పురుష అభ్యర్థులకు ₹100 దరఖాస్తు ఫీజు ఉంటుంది.

మహిళలు, SC, ST, PwBD, అర్హత కలిగిన Ex-Servicemen అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎలా అప్లై చేయాలి?

అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ముందుగా కొత్త SSC పోర్టల్‌లో One-Time Registration (OTR) పూర్తి చేసి, ఆ తర్వాత CHSL 2026 అప్లికేషన్‌ను సమర్పించాలి.

ఇంటర్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు SSC CHSL మంచి అవకాశం. గడువు ముగిసేలోపు అధికారిక వెబ్‌సైట్‌లో నిబంధనలు చెక్ చేసి అప్లై చేయాలి.

Official Notification : Click Here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment