తెలంగాణలో మొత్తం ఇంటర్ పరీక్షలు రాసిన వారు 9.97 లక్షల మంది. ఇందులో మొదటి సంవత్సరం గాను 4,89,126 మంది పరీక్ష రాశారు, ఇంటర్ 2వ సంవత్సరం 5,07,949 మంది పరీక్ష రాశారు ఈ మొత్తం విద్యార్థులు ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈవారం ఫలితాలు వస్తాయని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆశించారు కానీ ఫలితాలు విడుదల కాలేదు. ఫలితాలు ఆలస్యం కావడానికి కారణం వాల్యూషన్ చేసిన పేపర్స్ ని మళ్లీ జాగ్రత్తగా రివల్యూషన్ చేస్తున్నారు అందుకే ఆలస్యం అవుతున్నట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 12 నుండి 15వ తేదీల మధ్య ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
డబుల్ చెక్ :
గతంలో ఫలితాలు విడుదలలో ఎదురైన సాంకేతిక ఇబ్బందులు మార్పులు లెక్కింపులో జరిగిన తప్పులు దృష్టిలో ఉంచుకొని ఈసారి అలా జరగకుండా ఇంటర్ బోర్డు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.
రీవాల్యుయేషన్ :
విద్యార్థులు కేవలం ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారి పేపర్లను ఇంటర్ బోర్డు చాలా నిశితంగా పరిశీలిస్తుంది. అందులో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్ది విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తుంది. ఇలా చేయడం వల్ల ఏ ఒక్క విద్యార్థి కూడా అన్యాయంగా నష్టపోరు అనేది ఇంటర్ బోర్డు లక్ష్యం.
ఫలితాలు ఎప్పుడు? ఎవరి చేతుల మీదగా :
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మొదటి రెండవ సంవత్సర స్పాట్ వాల్యూషన్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఫలితాలు విడుదలకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది అయితే ఈ ఫలితాలను రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ని బట్టి ఆయన చేతుల మీదుగా ఫలితాలను ఈ నెల 12 నుండి 15వ తేదిలలో చేసే అవకాశం ఉంది.
ఫలితాలు ఎక్కడ చూసుకోవాలి :
రాష్ట్ర ప్రభుత్వం ఫలితాలు విడుదల చేసిన వెంటనే విద్యాద్రులు ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు చెక్ చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను ఆ లింకు క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోగలరు.
Results link : click here




