ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతి నాన్-పారామెడికల్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 33 రెగ్యులర్ మరియు బ్యాక్‌లాగ్ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.28,280 నుంచి రూ.89,720 వరకు జీతం లభించనుంది.
ఖాళీలు ఇవే :
- Junior Assistant
- Steno Cum Junior Assistant
- Cashier
- Billing Clerk
- Receptionist
- Gas Room Operator
మొత్తం 33 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు :
చాలా పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ తప్పనిసరి. కంప్యూటర్ నాలెడ్జ్, సంబంధిత అనుభవం కూడా అవసరం. Gas Room Operator పోస్టుకు SSCతో పాటు సంబంధిత ట్రేడ్ సర్టిఫికేట్ అవసరం.
వయస్సు :
- కనీసం: 18 సంవత్సరాలు
- గరిష్ఠం: 42 సంవత్సరాలు
- రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
అప్లికేషన్లు ఎక్కువగా వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహిస్తారు. అనంతరం అనుభవానికి వెయిటేజ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు.
దరఖాస్తు తేదిలు :
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 15 జూలై 2026
- చివరి తేదీ: 10 ఆగస్టు 2026 రాత్రి 11:59 వరకు.
దరఖాస్తు ఫీజు :
- OC / EWS: రూ.2,360
- BC / SC / ST: రూ.1,770
Official Notification : Click here






I need jio
10th pass
I need a job