ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) శుభవార్త చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 750 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు జూలై 7, 2026 నుంచి జూలై 20, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు :
మొత్తం పోస్టులు: 750
విద్య అర్హత :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (Graduation) పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ ఫలితాలు 31 జూలై 2026లోపు ప్రకటించబడాలి.
వయస్సు :
• కనీస వయస్సు: 20 సంవత్సరాలు
• గరిష్ఠ వయస్సు: 28 సంవత్సరాలు (01-07-2026 నాటికి)
రిజర్వేషన్ నిబంధనల ప్రకారం SC, ST, OBC, PwBD అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
స్టైపెండ్:
శిక్షణ కాలంలో ఎంపికైన అభ్యర్థులకు బ్రాంచ్ కేటగిరీ ఆధారంగా నెలకు
• మెట్రో: ₹15,500
• అర్బన్: ₹14,500
• సెమీ అర్బన్/రూరల్: ₹14,000
స్టైపెండ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించబడుతుంది.
ఎంపిక విధానం :
అభ్యర్థులను ఈ క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు
• ఆన్లైన్ పరీక్ష
• స్థానిక భాష పరీక్ష (అవసరమైతే)
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• బ్యాంక్ నిర్ణయించిన ఇతర ప్రక్రియలు
ఆన్లైన్ పరీక్షలో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, కంప్యూటర్/సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
ముఖ్యమైన తేదిలు :
• దరఖాస్తు ప్రారంభం: 07-07-2026
• దరఖాస్తు చివరి తేదీ: 20-07-2026
• ఫీజు చెల్లింపు చివరి తేదీ: 22-07-2026
• ఆన్లైన్ పరీక్ష (తాత్కాలికంగా): 02-08-2026
Official Notification : Click here





